దసరాకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్! ఆ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు

దసరాకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్! ఆ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు

చాలామంది ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. సొంతవారికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోన్నారు. అలా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండుగలకు సొంతూళ్లకు వెళ్తుంటారు. అందులోనూ సంక్రాంతి,దీపావళి, దసరా పండుగలకు పట్టణాల్లో స్థిరపడిన వారు.. వారి సొంతూళ్లకు వెళ్లి జరుపుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా దీపావళి పండగలకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు నగర వాసులు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలోనే రైల్వేశాఖ  ఓ శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల నడుమ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది.  మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృత్తిరిత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా.. పండుగలకు సొంతూళ్లకు వెళ్లి.. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకోవాలని భావిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అయితే హైదరాబాద్ తో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్లందరూ పండగలకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. పండుగకు నెల రోజుల ముందు నుంచి టికెట్ల బుకింగ్ చేసుకుంటున్నారు. బస్సులు, ట్రావెల్స్, ట్రైన్ల టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ట్రైన్లు ఫులై..వెయిటింగ్ లిస్ట్ భారీగా చూపిస్తుంది.

ఇక ఈ పండుగలను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక సర్వీసులు, రాయితీలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ పండుగల వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌ ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 13 వరకు పలు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల వివరాలను కూడా  రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతి గురువారం దానాపూర్ మధ్య సికింద్రాబాద్ (03225, 033226) ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు నడవనుంది. అలానే పాట్నా- సికింద్రాబాద్ (03253) ప్రత్యేక రైలు అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో అందుబాటులో ఉంటుంది.

అదేవిధంగా సికింద్రాబాద్- పాట్నా రైలు (07255) అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం మాత్రమే నడుస్తుంది. హైదరాబాద్- పాట్నాఅక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం నడవనుంది.  అలానే విశాఖపట్నం, సికింద్రబాద్ మధ్య అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేక రైలును అక్టోబరు 4 నుంచి నవంబర్ 29 వరకు ప్రతీ బుధవారం నడవనుంది. రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా సికింద్రాబాద్- విశాఖపట్నం(08580) రైలు కూడా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరి.. రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments