iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌ టీమ్‌పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు! వరల్డ్‌ కప్‌లో..

  • Published Oct 19, 2023 | 12:50 PM Updated Updated Oct 19, 2023 | 12:50 PM
  • Published Oct 19, 2023 | 12:50 PMUpdated Oct 19, 2023 | 12:50 PM
పాకిస్థాన్‌ టీమ్‌పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు! వరల్డ్‌ కప్‌లో..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా అదరగొడుతోంది. మూడు వరుస విజయాలతో వరల్డ్‌ కప్‌ వేటను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోంది. పైగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లాంటి పటిష్టమైన టీమ్స్‌ను ఓడించడం రోహిత్‌ సేన కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచింది. గురువారం మరో మ్యాచ్‌ కోసం టీమిండియా సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌ కోసం రెడీ అయింది. ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే.. టీమిండియా ఖాతాలో వరుసగా నాలుగు విజయాలు వచ్చి చేరుతాయి. కాగా, ఈ వరల్డ్‌ కప్‌లో క్రికెట్‌ లోకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌ ఏదంటే.. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా.. ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. పగా వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో అయితే.. ఇంకా భారీగా ఉంటుంది.

అయితే.. పాకిస్థాన్‌ చెత్త ప్రదర్శనతో మ్యాచ్‌లో ఉత్కంఠలేకుండా చేసింది. టీమిండియా అద్భుతంగా ఆడటంతో మ్యాచ్‌ వన్‌సైడ్‌గా అయిపోయింది. దీంతో.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌తో అసలు సిసలైన క్రికెట్‌ మజాను పొందుదామనుకున్న క్రికెట్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌ జరిగి.. రోజులు గడుస్తున్నా.. ఇంకా క్రికెట్‌ వర్గాల్లో ఆ మ్యాచ్‌ గురించే చర్చ నడుస్తోంది. ఇండియాపై ఓటమి తర్వాత పాకిస్థాన్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ అభిమానులే కాకుండా.. మాజీ క్రికెటర్లు సైతం ఏకిపారేస్తున్నారు. పాకిస్థాన్‌ ఇంత చెత్తగా ఆడుతుందని అనుకోలేని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ టీమ్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిందని.. చెత్త టీమ్‌లా ఆడిందంటూ పేర్కొన్నాడు. కానీ, తాము ఆడే సమయంలో పాకిస్థాన్‌ టీమ్‌ ఇలా ఉండేది కాదని, చాలా టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చేదని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టీమ్‌ కనీసం చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతుందని పేర్కొన్నాడు. అలాగే టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడిందని, బౌలింగ్‌లో వాళ్లు కమ్‌బ్యాక్‌ ఇచ్చిన తీరు సూపర్‌ అన్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినట్లు కితాబిచ్చాడు. మరి పాకిస్థాన్‌ టీమ్‌పై దాదా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ బంగ్లా బౌలర్‌ను ఎదుర్కొవడం కష్టం.. కానీ: విరాట్‌ కోహ్లీ