iDreamPost
android-app
ios-app

బ్యాటింగ్ మొదలు పెట్టిన సిట్ కెప్టెన్ రఘురామిరెడ్డి

బ్యాటింగ్ మొదలు పెట్టిన సిట్ కెప్టెన్ రఘురామిరెడ్డి

గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా నీయమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన పనిని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా దర్యాప్తు చేసి ఎవ్వరినైనా విచారించే విధంగా ఈ దర్యాప్తు బృందానికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నేపథ్యంలో సిట్ కి చీఫ్ గా నియమితులైన ఇంటిలిజెన్స్ డిఐజి కొల్లి రఘురామి రెడ్డి గత ప్రభుత్వంలో వచ్చిన అక్రమ ఆరోపణలపై ప్రాధమిక సమాచార సేకరణపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా తొలుత ఆయన డిజిపి గౌతమ్ సవాంగ్ ని కలిశాడు. ఈ సంధర్భంగా వారిరువురి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అనంతరం సీఐడీ ఏడీజీ పివి సునీల్ కుమార్ తో కూడా రఘురామిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమై రాజధానిలో రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబందించిన వివరాలు సేకరించినట్టు తెలిసింది.

రాజధాని భూ భాగోతంపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సీఐడీ ఇప్పటికే 7 కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో తమను భయపెట్టి, మోసం చేసి తమ దగ్గరనుండి భూములు లాకున్నారంటూ ఇద్దరు దళిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిడిపికి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు మరికొందరు పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటి యాక్ట్, 420, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలో 797 మంది తెల్ల రేషన్ కార్డు దారులు కొనుగోలు చేసిన భూముల వివరాలు, రేషన్ కార్డు నెంబర్లతో సహా ఆదాయపు పన్ను శాఖ (ఐటి), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) లకు సీఐడీ వివరాలు అందజేసింది.

ఈ నేపథ్యంలో తన విచారణని వేగవంతం చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సీఐడీ దర్యాప్తు, మని లాండరింగ్ పై ఈడీ విచారణ వివరాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది.