iDreamPost
అందులో మొదటిది ది లైఫ్ అఫ్ ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం సీరియస్ డ్రామాలో శింబు హీరో.
అందులో మొదటిది ది లైఫ్ అఫ్ ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం సీరియస్ డ్రామాలో శింబు హీరో.
iDreamPost
ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాల తాకిడి టాలీవుడ్ లో మళ్ళీ ఎక్కువయ్యింది. రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఎంత పోటీ ఉన్నా సరే థియేటర్లలో దింపక తప్పడం లేదు. ఈ నెలలో రాబోతున్న రెండు అరవ చిత్రాలు మూవీ లవర్స్ దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందులో మొదటిది ది లైఫ్ అఫ్ ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం సీరియస్ డ్రామాలో శింబు హీరో. ఇది రెండు భాగాలుగా రానుంది. తెలుగు హక్కులను స్రవంతి రవికిశోర్ చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్ 15 విడుదలనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల 17కి వాయిదా పడింది. ఒరిజినల్ వెర్షన్ మాత్రం 15న వస్తుంది.
చాలా కాలంగా ఇక్కడ మార్కెట్ తగ్గిపోయిన శింబు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నిజానికి మానాడు తెలుగులోనూ డబ్ కావాల్సింది. కానీ సురేష్ బాబు రీమేక్ హక్కులను కొనడంతో అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాక ఆగిపోయింది. లేకపోతే మంచి ఫలితం దక్కేది. అందుకే లైఫ్ అఫ్ ముత్తుకి ప్రమోషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడట. ఇక రెండోది ధనుష్ నేనే వస్తున్నా. అతని అన్నయ్య సెల్వ రాఘవన్ డైరెక్టర్. దీని మీద కూడా చాలా అంచనాలున్నాయి. పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30కి వస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా 29నే వస్తుందట. దీని డిస్ట్రిబ్యూషన్ గీతా ఆర్ట్స్ సమర్పణలో అల్లు అరవింద్ తీసుకున్నారు.
రెండు పెద్ద బ్యానర్ల అండతో ది లైఫ్ అఫ్ ముత్తు, నేనే వస్తున్నా మన ఆడియన్స్ ని పలకరించనున్నాయి. అంచనాల పరంగా వీటి మీద ఇక్కడ పెద్ద బజ్ ఏమి లేదు కానీ పబ్లిసిటీ ఎలా ప్లాన్ చేస్తారనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ నెలలో చెప్పుకోదగ్గ తెలుగు స్ట్రెయిట్ మూవీ ఏదీ లేదు. వస్తున్నవన్నీ మీడియం ప్లస్ చిన్న సినిమాలే. అందుకే ఈ డబ్బింగ్ వాటికి మంచి ఛాన్స్ దక్కింది. ఇక్కడేమో కానీ కోలీవుడ్ లో మాత్రం వీటి మీద క్రేజ్ మాములుగా లేదు. యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు హోరెత్తిపోతాయి. పైగా శింబు, ధనుష్ లు ఇద్దరూ మంచి హిట్లతో ఊపుమీదున్న. తెలుగులోనూ అదే ఫలితం దక్కితే వాళ్లకు అంతకన్నా కావాల్సింది ఏముంది