iDreamPost
android-app
ios-app

డిజే టిల్లు 2లో డబుల్ ట్విస్టులు

  • Published Aug 19, 2022 | 12:57 PM Updated Updated Dec 06, 2023 | 3:23 PM

పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని సిద్ధూ జొన్నలగడ్డని ఏకంగా స్టార్ ని చేసేసింది.

పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని సిద్ధూ జొన్నలగడ్డని ఏకంగా స్టార్ ని చేసేసింది.

  • Published Aug 19, 2022 | 12:57 PMUpdated Dec 06, 2023 | 3:23 PM
డిజే టిల్లు 2లో డబుల్ ట్విస్టులు

ఈ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్న సినిమా డీజే టిల్లు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుని సిద్ధూ జొన్నలగడ్డని ఏకంగా స్టార్ ని చేసేసింది. మరీ వందల కోట్ల రేంజ్ రాలేదు కానీ ఏళ్ళ తరబడి ఎదురు చూసిన అతను కోరుకున్న బ్రేక్ మాత్రం దీంతోనే దక్కింది. ఓటిటిలో వచ్చాక దీన్ని రిపీట్ రన్ లో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎందరో. దీనికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే దర్శకుడు మారాడు. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చినట్టుగా ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అభిప్రాయభేదాలో ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియలేదు.

సిద్ధూ కేవలం ఈ రెండో భాగం కోసమే వేరే కమిట్ మెంట్స్ ఒప్పుకోకుండా ఆల్రెడీ కమిట్ అయిన ఓ రెండు ప్రాజెక్టులను కూడా డ్రాప్ అయ్యాడట. ఇక ఫ్యాన్స్ కి కిక్కిచ్చే మరో లీక్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి పాత్ర ఇప్పుడీ నెంబర్ టూలో పరిమితంగా ఉంటుందట. తనను తీసేయలేదు కానీ పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను ప్రాధాన్యం ఎక్కువ ఉన్న క్యారెక్టర్ కి తీసుకోబోతున్నారని తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తయ్యింది కానీ క్యాస్టింగ్ కోసం ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టలేదు. అదవ్వగానే షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి డీజే టిల్లు వచ్చిన టైంలోనే ఈ సీక్వెల్ కూడా రిలీజ్ చేస్తారట.

Sreeleela Dhamaka
మొత్తానికి శ్రీలీల దూకుడు జోరుగా ఉంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా అవకాశాలకు మాత్రం లోటు లేదు. రవితేజ లాంటి సీనియర్ హీరోతో ధమాకాలో ఆడి పాడేందుకు వెనుకాడలేదు. గాలి జనార్దన్ రెడ్డి వారసుడిని తెరకు పరిచయం చేస్తున్న మూవీలోనూ ఆఫర్ కొట్టేసింది. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందబోయే ఎంటర్ టైనర్ లో తన పేరే వినిపిస్తోంది కానీ యూనిట్ ఇంకా బయటికి చెప్పలేదు. నవీన్ పోలిశెట్టితో చేస్తున్న అనగానగా ఒక రాజు షూటింగ్ చివరి దశలో ఉంది. ఇలా క్రేజీ అవకాశాలతో డైరీని బిజీగా ఉంచుకుంటుంది శ్రీలీలకు ఒక్క బ్లాక్ బస్టర్ పడితే పూజా హెగ్డే, రష్మిక మందన్నల సరసన చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet