సిద్ శ్రీరామ్ అనే పేరు కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తమిళనాడుకు చెందిన ఆయన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక పాటలు పాడి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.. ఆయన పాడిన ప్రతి పాట ఒక సెన్సేషన్. యూట్యూబ్ లో విడుదల చేయగానే మిలియన్ల కొద్దీ దక్కించుకుంటూ ప్రస్తుతం ఉన్న అందరు సింగర్స్ లో క్రేజియస్ట్ సింగర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన పాటలు ఎంచుకునే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారానికి ఒక్క పాట మాత్రమే పాడతానని ఆయన తనకు తాను గిరి తీసుకున్నట్లుగా ఆ మధ్య ఒక మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడించారు. నిజమే మరి, వచ్చిన ప్రతి అవకాశాన్ని దక్కించుకుని పాడుకుంటూ వెళ్ళిపోతే కొన్నాళ్లకు ఆయన పాటలు కూడా జనానికి బోర్ కొట్టొచ్చు.
అందుకే తెలివిగా వారానికి ఒక పాట అంటే నెలకు నాలుగు పాటలు, అలా తెలివిగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకు కొత్త ప్రచారం ఒకటి వచ్చింది.. అదేమిటి అంటే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మణిరత్నం తెరకెక్కించిన కడలి అనే సినిమాతోనే సిద్ శ్రీరామ్ గాయకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమాలో ఆయనను హీరోగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని కూడా అంటున్నారు.
ఇప్పటికే హీరోగా ఆయన ఖరారయ్యాడని మణిరత్నం లాంటి దర్శకుడితో లాంచ్ కావడం తన అదృష్టంగా శ్రీరామ్ భావిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఒక పక్క గాయకుడిగా ఉంటూ మరో పక్క హీరోగా మారడం అనేది రెండు పడవల మీద కాలు వేసే ప్రయత్నం అనే చెప్పాలి. తన దగ్గర అద్భుతమైన గాత్రం ఉంచుకుని ఆయన ఇప్పుడు హీరోగా మారడం అనేది ఇబ్బందికర అంశమే. అయితే ఆయన పూర్తిగా తన పాటలు ఆపేసి నటన మీద దృష్టి పెడతారా? నేడు చూడాలి. మరి ఈ విషయం నిజమో కాదో ఆయన స్వయంగా అధికారిక ప్రకటన చేస్తే గాని చెప్పలేం.
Also Read : Bangarraju : అక్కినేని టార్గెట్ కష్టమేమి కాదు