iDreamPost
iDreamPost
కరోనా పుణ్యమాని ఓటిటిల ఉధృతి పెరగడం వల్ల నిర్మాతలకు విడుదల విషయంలో ఇంకో ఆప్షన్ సిద్ధంగా ఉంటోంది. అఫ్కోర్స్ ఇది చిన్న సినిమాలకు వర్తించకపోయినా అంతో ఇంతో ఆదాయ వనరుగా డిజిటల్ సంస్థలు నిలుస్తున్నాయన్నది వాస్తవం. ఒకవేళ థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లేదా డిస్ట్రిబ్యూటర్లు ఆశించిన మొత్తాన్ని ఆఫర్ చెయ్యకపోయినా డిజిటల్ బాట పట్టేందుకు ప్రొడ్యూసర్లు మొహమాటపడటం లేదు. ఈ క్యాలికులేషన్ పక్కాగా చేసుకోవడం వల్లే సురేష్ బాబు అంతటి అగ్ర నిర్మాత సైతం వెంకటేష్ నారప్ప, దృశ్యం 2లు హోల్ సేల్ గా అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చే మంచి లాభాలు చేసుకున్నారు.
ఇక అసలు విషయాన్ని వస్తే శర్వానంద్ కొత్త సినిమా ఒకే ఒక జీవితం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉంది. రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ యూనిట్ ఇవ్వడం లేదు. ఎప్పుడో నాలుగు నెలల క్రితం ఒక మోషన్ పోస్టర్ వదలడం తప్పించి ఇంకే ఊసూ లేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఓటిటికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా ఇన్ సైడ్ న్యూస్. అధికారికంగా చెప్పలేదు కానీ నిజమయ్యే ఛాన్స్ ఉంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ టైం లైన్ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్. అమల అక్కినేని హీరో తల్లిగా ఒక కీలక పాత్ర చేశారు. క్యాస్టింగ్ బాగానే ఉంది.
కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు లేకపోలేదు. శర్వానంద్ కు డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం ఇలా వరసగా ఏదీ కనీస స్థాయిలోనూ ఆడక మార్కెట్ దెబ్బ తింది. ఈ నేపథ్యంలో ఒకే ఒక జీవితంకు ఏమంత హైప్ లేదు. అందులోనూ టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉండటంతో క్లాస్ ఆడియన్స్ తప్ప ఇంకెవరిని టార్గెట్ చేసేలా కనిపించడం లేదు. అందుకే నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అఫీషియల్ కాలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ నిప్పులేనిదే పొగరాదుగా. చూద్దాం
Also Read : Krithi Shetty : బేబమ్మ బ్యూటీ తెలివైన ప్లానింగ్