iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ పాత్రకు షాకింగ్ ట్విస్టు

  • Published Dec 19, 2022 | 5:12 PM Updated Updated Dec 19, 2022 | 5:12 PM
  • Published Dec 19, 2022 | 5:12 PMUpdated Dec 19, 2022 | 5:12 PM
రామ్ చరణ్ పాత్రకు షాకింగ్ ట్విస్టు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న RC 15 షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కు పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. తమ సంస్థ యాభయ్యవ సినిమా కావడంతో నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రాధమిక అంచనా ప్రకారం ఈజీగా రెండు వందల యాభై కోట్ల దాకా ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన లీకులు కొన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టీమ్ కష్టపడి వీటికి చెక్ పెట్టింది కానీ పూర్తి స్థాయిలో కట్టడిచేయలేకపోయిందనే సంగతి గుర్తే

తాజాగా మరో లీక్ బయటికి వచ్చింది. దాని ప్రకారం చరణ్ ఫ్లాష్ బ్యాక్ పాత్రకు నత్తి ఉంటుందట. స్వాతంత్ర సమరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఎపిసోడ్ లో హీరో పాత్రను పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్రీడమ్ ఫైటర్ గా సెట్ చేశారు. అది తండ్రిగా వర్తమానంలో అతని కొడుకే కొత్త చరణ్ గా రెండు షేడ్స్ ఉంటాయట. ఒకప్పుడు నత్తిని కేవలం కేవలం హాస్య పాత్రలకు వాడేవారు. ఇటీవలే వచ్చిన లైగర్ లో విజయ్ దేవరకొండ, ఎఫ్3 లో వరుణ్ తేజ్ ఇదే తరహా క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు. అయితే సీరియస్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఆర్సి 15లో నత్తిని ఎలా వాడుకుంటారో చూడాలి. ఈ ట్రాక్ తాలూకు షూట్ ఎప్పుడో పూర్తయ్యింది.

విడుదలకు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2023లో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శంకర్ ఒకపక్క ఇండియన్ 2 చేస్తూనే ఇందులో భాగం కావడంతో బాలన్స్ చేయడం కోసం రెగ్యులర్ గా బ్రేక్స్ ఇస్తున్నారు. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కు శంకర్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి ఆరేడు నెలలు అవసరమయ్యేలా ఉన్నాయి. దీన్ని బట్టి వచ్చే దసరా లేదా దీపావళికి రావడం కూడా కష్టమే. ఇదయ్యాక సుకుమార్ తో చరణ్ కాంబో ఉండే ఛాన్స్ ఉంది. ఆర్సి 17గా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన పేరు ఫిక్స్ అయ్యింది కనక దానికన్నా ముందు రంగస్థలం కాంబో ఉండొచ్చు

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom