SNP
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో మరో క్రేజీ మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. మూడు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. పూణె వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరం అయ్యాడు. అతని స్థానాంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌కు షకీబ్ లేకుండా బంగ్లా బరిలోకి దిగడం అందర్ని షాక్‌కు గురిచేసింది. టీమ్‌లో మోస్ట్ సీనియర్ ప్లేయర్, పైగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షకీబ్ మ్యాచ్ ఆడకపోవడంపై బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తి చేస్తున్నారు.
అయితే.. షకీబ్ ఎందుకు ఆడటం లేదనే విషయంపైగా కూడా బంగ్లా టీమ్ మేనేజ్‌మెంట్ ఒక స్పష్టత ఇవ్వలేదు. చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు కానీ, అసలు నిర్దిష్టమైన కారణం వెల్లడించలేదు. అయితే.. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత బంగ్లాదేశ్ డగౌట్‌లో డార్క్ సన్‌గ్లాసెస్‌తో షకీబ్ కనిపించాడు. దీంతో.. అతనికి కండ్లకలక అయినట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. గాయం లాంటివి ఏం లేకపోయినా.. షకీబ్ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. షకీబ్ లేకపోవడం బంగ్లాదేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్ షకీబ్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. పైగా ఇండియా లాంటి టాప్ టీమ్‌తో షకీబ్ లేకుండా బంగ్లా ఎలా పోరాడుతుందో చూడాలి.
ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా మూడు వరుస విజయాలు సాధించి.. మంచి జోరు మీదుంది. పైగా ఆ మూడు విజయాల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి రెండు పెద్ద టీమ్స్‌పై ఘన విజయాలు సాధించడం భారత జట్టు కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లోనే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మరోసారి టాప్ ప్లేస్‌కు చేరుకోవాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉండటం.. బౌలింగ్‌లో సిరాజ్, బుమ్రా, పాండ్యా, కుల్దీప్ యాదవ్, జడేజా అదరగొడుతుండటం టీమిండియాను నెక్ట్స్ లెవెల్ టీమ్‌లా ప్రొజెక్ట్ చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలతో ఉంది. మరి టీమిండియా ఏ మేర పోటీ ఇస్తుందో చూడాలి. మరి భారత్‌తో మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No Shakib Al Hasan for Bangladesh today. pic.twitter.com/YbaJth8PS1
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023
ఇదీ చదవండి: పాకిస్థాన్ టీమ్‌పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు! వరల్డ్ కప్‌లో..