iDreamPost
android-app
ios-app

జెర్సీ దెబ్బకు 13 కుట్లు

  • Published Jan 13, 2020 | 7:44 AM Updated Updated Jan 13, 2020 | 7:44 AM
  • Published Jan 13, 2020 | 7:44 AMUpdated Jan 13, 2020 | 7:44 AM
జెర్సీ దెబ్బకు 13 కుట్లు

మొన్నటిదాకా మీడియం కన్నా కాస్త తక్కువ స్థాయిలో ఉంటూ మార్కెట్ తో పాటు ఫాం కోల్పోయిన షాహిద్ కపూర్ కు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కొత్త ఊపిరి ఇచ్చింది. ఏకంగా మూడు వందల కోట్ల దాకా అది బిజినెస్ చేయడంతో ఒక్కసారిగా షాహిద్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన సందీప్ వంగానే అక్కడా టేకప్ చేయడంతో ఫీల్ చెడకుండా కాపాడాడు. బాలీవుడ్ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఎంత నెగటివ్ ప్రచారం చేసినా హిట్ కాకుండా ఆపలేకపోయారు.

ఇప్పుడు షాహిద్ కపూర్ నాని సూపర్ హిట్ మూవీ జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు. షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. అందులో భాగంగా క్రికెట్ మ్యాచ్ ని తీస్తుండగా అనుకోకుండా బాల్ తగిలి షాహిద్ మొహానికి గాయాలయ్యాయి. తీరా చూస్తే పరీక్ష చేసిన డాక్టర్లు చిన్న సర్జరీ చేసి 13 కుట్లు వేశారట. దీంతో మొహానికి మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు షాహిద్. ఇలాంటి స్క్రిప్ట్ ఈ మాత్రం గాయాలను డిమాండ్ చేస్తుందని సంతోషంగా దీన్ని స్వీకరిస్తున్నానని షాహిద్ చెప్పడం విశేషం.

అక్కడా గౌతం తిన్ననూరినే దర్శకత్వం వహిస్తున్నాడు. కబీర్ సింగ్ తరహాలో ఫలితం రావాలంటే నార్త్ డైరెక్టర్లకు ఇవ్వకూడదని షాహిద్ ముందే డిసైడ్ అయ్యాడట. టైటిల్ కూడా జెర్సీనే ఫిక్స్ చేశారు. హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ నటిస్తుండగా సత్యరాజ్ క్యారెక్టర్ లో షాహిద్ నిజ జీవిత తండ్రి పంకజ్ కపూర్ కనిపించనుండటం విశేషం. ఈ ఏడాది ఆగష్టు 28 రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఒకవేళ ఇప్పటి ప్రమాదం వల్ల రెస్ట్ ఎక్కువ అవసరమైతే తేదీ మారే ఛాన్స్ ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet