దాదాపు 4 దశాబ్దాల నుండి భారత వాయుసేనలో ఎనలేని సేవలు అందించిన మిగ్ 27 విమానాలు సైన్యం నుండి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నాయి. నిన్న జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా మిగ్ 27 విమానాలు గగనతలంలో గర్జించాయి. జోథ్‌పూర్ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్‌కే ఘోటియా పాల్గొన్నారు
20 సంవత్సరాల క్రితం పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 27 యుద్ధ విమానం గత నాలుగు దశాబ్దాలుగా భారత వైమానిక దళం యొక్క గ్రౌండ్ అటాక్ నౌకాదళానికి వెన్నెముక గా ఉంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన ఈ అప్ గ్రేడ్ వెర్షన్ మిగ్ 27 సిరీస్ విమానాలు 2006 లో సైన్యంలో చేరాయి. కాగా ఇప్పటికే మిగ్ విమానాల సీరీస్ లోని మిగ్ -23 బిఎన్, మిగ్ -23 ఎమ్ఎఫ్ మరియు పాత రకం మిగ్ 27 వంటి అన్ని ఇతర వేరియంట్లు ఇప్పటికే భారత వైమానిక దళం నుండి రిటైర్ అయ్యాయి.
ఈ మిగ్ 27 విమానాలు యుద్ధ సమయంలో శత్రు స్థానాలపై మెరుపువేగంతో ఖచ్చితత్వంతో దాడులు చేసి అంతే వేగంగా శత్రు రాడార్లకి చిక్కకుండా తిరిగొచ్చేవి. ఈ విమానం అనేక జాతీయ మరియు అంతర్జాతీయ విన్యాసాలతో కూడా పాల్గొంది.
భారత వాయు విభాగం 29 వ స్క్వాడ్రన్ లో మాత్రమే ప్రస్తుతం మిగ్ 27 విమానాలు తమ సేవలనందిస్తున్నాయి. ఈ స్క్వాడ్రన్‌ను మార్చి 10, 1958 లో హల్వారాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ప్రారంభించారు.ఈ స్క్వాడ్రన్‌లో మిగ్ 21 టైప్ 77, మిగ్ 21 టైప్ 96, మిగ్ 27 ఎంఎల్ మరియు మిగ్ 27 అప్‌గ్రేడ్ వంటి అనేక రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి.
జోధ్ పూర్ లోని వైమానిక స్థావరం లో మిగ్ 27 యొక్క డి-ఇండక్షన్ (వీడ్కోలు) వేడుక కోసం వాయుసేనకి విశిష్ట సేవలందించిన వెటరన్ వైమానిక యోధులను సన్మానించారు.