iDreamPost
android-app
ios-app

వీడియో: కిడ్నాపర్ నుంచి తల్లి చెంతకు చేరేందుకు నిరాకరించిన బాలుడు!

2 year Old Boy Cry kidnapper: తన స్వార్థం కోసం నెలల పసిబిడ్డను ఎత్తుకొచ్చేశాడో వ్యక్తి. పాలు తాగే వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. చివరకు 14 నెలల తర్వాత ఎట్టకేలకే పోలీసులకు చిక్కాడు. బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలో అతడు కిడ్నాపర్ ను వదలేదుకు ససేమిరా అన్నాడు.

2 year Old Boy Cry kidnapper: తన స్వార్థం కోసం నెలల పసిబిడ్డను ఎత్తుకొచ్చేశాడో వ్యక్తి. పాలు తాగే వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. చివరకు 14 నెలల తర్వాత ఎట్టకేలకే పోలీసులకు చిక్కాడు. బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలో అతడు కిడ్నాపర్ ను వదలేదుకు ససేమిరా అన్నాడు.

వీడియో: కిడ్నాపర్ నుంచి తల్లి చెంతకు చేరేందుకు నిరాకరించిన బాలుడు!

సాధారణంగా ఏ బిడ్డైన సరే..తన తల్లిదండ్రులను, ముఖ్యంగా అమ్మను చూడగానే అక్కున్నా చేరిపోతారు. ఎవరైనా తన తల్లి నుంచి దూరం చేస్తే… బిడ్డలు భోరున వినలపిస్తారు. అయితే తాజాగా ఓ విచిత్ర  సంఘటన చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల బాలుడు తన కిడ్నాప్ చేసిన వ్యక్తిపై మమకారం పెంచుకున్నాడు. అతడి నుంచి తన తల్లి చెంతకు చేరేందుకు ఆ బాలుడు నిరాకరించాడు. అమ్మానాన్న వద్దకు వెళ్లేందుకు మొండికేశాడు. ఆ బిడ్డను అప్పగించే క్రమంలో సదరు కిడ్నాపర్‌ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన తనూజ్‌ చాహర్‌ రిజర్వ్‌ పోలీస్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ పని చేశాడు. ఓ కేసు విషయంలో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.  ఈ క్రమంలోనే రాజస్థాన్‌కు చెందిన పృథ్వీ అనే 8 నెలల చంటిబిడ్డను కిడ్నాప్ చేశాడు. గతంలో పోలీసు విభాగంలో పని చేసిన అనుభవం ఉండటంతో మొబైల్ వాడకుండా చాలా కాలం ఎవరి దొరకలేదు. అంతేకాక పోలీసుల కళ్లు గప్పి..బాలుడితో వేరు వేరు ప్రాంతాల్లో తిరిగాడు. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుతూ తన గెటప్ మార్చేవాడు. ఆ బాలుడి కోసం గాలిస్తున్న పోలీసుల్ని తనూజ్ చాహర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే  ఎట్టకేలకు  14 నెలల తరువాత ఇటీవల అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని అలీఘర్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఇక్కడి వరకు అంత మాములు స్టోరీనే జరిగినా.. ఇక్కడ మాత్రం ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. నెలల వయస్సులో ఉన్నప్పుడు కిడ్నాపర్ చెంతకు చేరడంతో, తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చాహరే పెంచడంతో  ఆ చిన్నారి బాలుడు పృథ్వి కిడ్నాపర్ పై మమకారం పెంచుకున్నాడు. కిడ్నాపర్‌ను వీడేందుకు ససేమిరా అంటూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనంటూ బోరున విలపించాడు. అదే సమయంలో తనను వీడుతున్న బాధతోనో బిడ్డను అప్పగించే క్రమంలో ఆ కిడ్నాపర్‌ కళ్లలో కూడా కన్నీటి సుడులు తిరిగాయి. ఇలా బాలుడు ఓ వైపు ఏడుస్తున్నా కిడ్నాపర్  నుంచి బలవంతంగా తప్పించి ఆ బిడ్డను అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలుడిని కిడ్నాప్ చేయడానికి గల కారణం పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పూనమ్ చౌదరిని తనతో వచ్చేయాలని కిడ్నాపర్ తనూజ్ ఒత్తిడి చేశాడంట. అయితే ఆమె నిరాకరించడంతో, ఆకోపంతో పూనమ్ బిడ్డను ఎత్తుకొచ్చేశాడని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.