iDreamPost
android-app
ios-app

పైసా కూడా లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!

నేటికాలంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బాగా ధనవంతుడై ఉండాలి. పేద వాడు ఎన్నికల్లో పోటీ చేసిన ఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కొందరు ఒక్క పైసా కూడా లేకుండా పోటీ చేస్తున్నారు.

నేటికాలంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బాగా ధనవంతుడై ఉండాలి. పేద వాడు ఎన్నికల్లో పోటీ చేసిన ఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కొందరు ఒక్క పైసా కూడా లేకుండా పోటీ చేస్తున్నారు.

పైసా కూడా లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు. అయితే బాగా డబ్బు ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలరనే భావన చాలా మందిలో ఉంది. అందుకే రాజకీయాలు, ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడిన పనని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. పైసా కూడా ఖర్చుకాకుండా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఉంటారు. అయితే అది కేవలం వారు నామినేషన్ పత్రాల్లో సమర్పించిన  వివరాలు మాత్రమే. ప్రతి ఎన్నికల్లో ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. తాజాగా కూడా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పైసా కూడా లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా..

తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మిజోరాం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లోని 199 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగుతోంది. అన్ని పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లవడనున్నాయి.

ఈసారి దేశంలోని  అందరి దృష్టి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నే ఉంది. కారణం ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.  ఇక ఈ పోటీల్లో వందల కోట్ల ఆస్తులు కలిగిన అభ్యర్థులు పోటీకి దిగారు. అదే సమయంలో ఒక్క రూపాయి కూడా ఆస్తి లేని అభ్యర్థులు కూడా  ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించకుంటున్నారు. పలువురు అభ్యర్థులు తమ నామినేషన్  పత్రాల్లో తమ దగ్గర ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొన్నారు.  అల్వార్ జిల్లాలోని తనగాజీ స్థానం నుండి బీఎస్పీ నుంచి బన్వారీ లాల్ శర్మ  పోటీ చేస్తున్నారు.

ఆయన తన ఆస్తులను జీరోగా అఫిడవిట్ లో చూపించారు.  అదే జిల్లాలోని బెహ్రోర్ అసెంబ్లీ  స్థానం నుంచి పోటీ చేస్తున్న  ఇండియన్ పీపుల్స్ గ్రీన్ పార్టీ అభ్యర్థి  హేమంత్ శర్మ కూడా తనకు ఆస్తులు లేవని పేర్కొన్నారు. దీపక్ కుమార్ అనే మరో అభ్యర్థి కూడా తన దగ్గర ఎలాంటి ఆస్తి లేదని తెలిపారు. ఈయన సవాయ్ మోథ్ పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలానే బద్రీలాల్ అనే అభ్యర్థి తన అఫిడవిట్ లో ఆస్తులు సున్నాగా చూపించారు. ఈయన ఝలావర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వడ్ దాగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మజ్దూర్ కిసాన్ అకాలీ దళ్ టిక్కెట్ పై గంగానగర్ జిల్లాలోని ఎస్సీ రిజర్వడ్ స్థానం రాయసింగ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన కూడ తన వద్ద ఒక్క పైసా కూడా లేదని తెలిపారు.

బికనీర్ జిల్లాలోని నోఖా అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న కన్హయ్యలాల్  కూడా తనకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలానే వేద్ ప్రకాష్ యాదవ్, పురుషోత్తం అనే అభ్యర్థులు కూడా తమకు ఎలాంటి ఆస్తులు లేవని వారిఅఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇక ఇదే ఎన్నికల్లో  రూ.500 ఆస్తులు మాత్రమే ఉన్నాయని మరికొందరు అభ్యర్థులు తెలిపారు. మరి.. వీరికి  అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. మరి. పైసా కూడా  తమ వద్దలేదని పేర్కొన్న ఈ అభ్యర్థుల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.