P Krishna
Jodhpur Crime News: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందగా, మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఎక్కడంటే..
Jodhpur Crime News: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందగా, మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఎక్కడంటే..
P Krishna
ఈ మద్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం.. ఎదుటి వారిపై దాడులు చేస్తూ హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, డిప్రేషన్ ఇలా ఎన్నో కారణాల వల్ల మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం తీవ్ర కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య అనుమానాలు నిండు కుటుంబాలను బలితీసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే..
జోధ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యమయ్యాయి. భర్త మృతదేహం రైల్వే ట్రాక్ పై, భార్య, పిల్లల మృతదేహాలు కాలువలో లభ్యమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్వర్‌లాల్ ఆచార్యకు బార్మర్‌కు చెందిన పూనమ్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు, ఆరేళ్ల భరత్ (3), సౌరభ్ (4) ఉన్నారు. కన్వర్‌లాల్ ఆచార్య(32) వృత్తిరీత్యా కూలీ. తన భార్య ఇద్దరు పిల్లలతో తిన్వారీలో నివసించేవాడు. తన భార్యా పిల్లలను ట్రైన్ లో తీసుకువెళ్తానని చెప్పి తిరిగి రాలేదు.
ఈ క్రమంలోనే తిన్వారీ-మథానియా మధ్య రైల్వే ట్రాక్‌పై కన్వర్ లాల్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయం గురించి ఆయన భార్య పూనమ్ కి చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఆమెతో పాటు పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. దీంతో గ్రామస్థులు, పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ కేనాల్ లో పూనమ్, పిల్లల మృతదేహాలు కనిపించాయి. కుటుంబ కష్టాలో.. ఏ ఇతర ఇబ్బందుల కారణంగా.. భర్తే భార్యా పిల్లలను కెనాల్ లో తోసి తర్వాత తిన్వారీ-మథానియా మధ్య రైల్వే ట్రాక్‌పై బైక్‌ను తీసుకెళ్లి రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కన్వర్ లాల్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. క్షణిక ఆవేశం, బతుకుపై విరక్తి తో ఒక నిండు కుటుంబం బలైంది.