iDreamPost
android-app
ios-app

సికింద్రాబాద్ అల్లర్లు : విధ్వంసకాండ వెనుక కీలక సూత్రధారి అరెస్ట్

  • Published Jun 18, 2022 | 5:12 PM Updated Updated Jun 18, 2022 | 5:12 PM
సికింద్రాబాద్ అల్లర్లు : విధ్వంసకాండ వెనుక కీలక సూత్రధారి అరెస్ట్

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పదకాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్రకోణం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ విధ్వంసం వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును నరసారావుపేటలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను విధ్వంసం సృష్టించేలా అతను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ తరహాలో గుంటూరులో కూడా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుబ్బారావు గుంటూరులో సాయి డిఫెన్స్ అకాడమీని స్థాపించి ఆర్మీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నాడు.

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పదకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు వివిధ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థులకు పిలుపునిచ్చాడు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ముట్టడించాలని రెచ్చగొట్టాడు. గురువారం రాత్రి హైదరాబాదద్ కు వచ్చాడు. ఎప్పటికప్పుడు సుబ్బారావు వాట్సాప్ లో మెసేజ్ లు పంపడంతోనే అల్లర్లు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుబ్బారావును అరెస్ట్ చేయకపోతే.. మరిన్ని ప్రాంతాల్లో సికింద్రాబాద్ తరహా విధ్వంసకాండ జరిగేదని అనుకుంటున్నారు.