iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డే లేఖ రాశారు.. ధృవీకరించిన కేంద్ర మంత్రి

  • Published Mar 20, 2020 | 6:54 AM Updated Updated Mar 20, 2020 | 6:54 AM
  • Published Mar 20, 2020 | 6:54 AMUpdated Mar 20, 2020 | 6:54 AM
నిమ్మగడ్డే లేఖ రాశారు.. ధృవీకరించిన కేంద్ర మంత్రి

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రమేష్‌కుమార్‌ లేఖ రాసినట్లు హోం శాఖ కార్యదర్శి తనకు చెప్పారని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి ఎస్‌ఈసీ లేఖ రాసిన విషయం ధృవీకరించారు.

లేఖ అందిన తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఏపీ చీఫ్‌ సెక్రటిరీతో మాట్లాడారని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో పూర్తి భద్రత మధ్య ఉన్నారని చెప్పారు. ఆయన ఎప్పుడు ఏపీకి వెళ్లినా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చెప్పామని తెలిపారు. ఈ విషయం ఆ రాష్ట్ర అంతర్గత విషయం అయినా.. రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలని ఈ రోజు లిఖిత పూర్వక ఆదేశాలు కూడా ఇస్తామన్నారు. ఏ ప్రభుత్వం కూడా అధికారిని ఇబ్బందిపెట్టదు. అయినా భద్రతపై అధికారి భయపడుతుంటే.. భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet