iDreamPost
android-app
ios-app

వడివడిగా ‘బడి’వైపు..

  • Published Oct 12, 2020 | 9:46 AM Updated Updated Oct 12, 2020 | 9:46 AM
వడివడిగా ‘బడి’వైపు..

కోవిడ్‌ 19 కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంవత్సరానికి అంతరాయం ఏర్పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ సడలింపులు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు బడుగులు తెరుచుకోవచ్చని తేల్చిచెప్పేసింది. దీంతో పలు రాష్ట్రాల్లో 9,10 తరగతులు ఆ పైన విద్యార్ధులను స్కూల్స్‌కు రప్పిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో విద్యాకానుక పేరిట విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, షూస్‌ తదితర వస్తువులను ముందుగానే అందజేసారు.

తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలలు పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించుకుంది. సర్వీస్‌ పాయింట్లు ప్రాతిపదికగా ఈ సారి బదిలీలు ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఉత్తర్వులు వెలువడ్డాక ఆనలైన్‌లోనే దరకాస్తు చేసుకుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆన్‌లోనే కౌన్సిలింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. రేషనైలేజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీలు జరిగే విధంగా షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాధికారుల సూచనలు, సహాల మేరకు విధివిధానాలను రూపకల్పన చేసారు. ఈ యేడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ళ సర్వీసు పూరి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీకి అర్హత పొందుతారు. అలాగే ఒకే చోట అయిదేళ్ళు పూర్తయిన హెచ్‌యంలు, ఎనిమిదేళ్ళసర్వీసు పూర్తయిన టీచర్లు తప్పని సరిగా బదిలీ అవుతారు. టీచర్లు విద్యార్ధులు 1ః30 నిష్పత్తి ప్రకారం పోస్టులను కేటాయించనున్నారు. దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు.

గత ప్రభుత్వాల హాయాంలో బదిలీల అంశంపై కూడా పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. క్లిష్టమైన ప్రక్రియ కారణంగా పలువురు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే పలు అంశాల్లో మార్పులు, చేర్పులు చేసి బదిలీ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీ విధానాలు ఉంటాయన్న భావన వ్యక్తం చేస్తున్నారు.