iDreamPost
స్టేట్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లు ఇకపై ఏటీఎం నుంచి డబ్బును విత్ డ్రా చేస్తున్నప్పుడు, ఓటీపీని తప్పనిసరి చేసింది. మోసపూరిత ATM లావాదేవీల నుండి తన కస్టమర్లను రక్షించడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) విధానాన్ని అమలుచేస్తోంది. నిజానికి చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రాకు ఈ పద్ధతికి మారనున్నాయి.

ఒకవేళ ఎవరైనా మన కార్డును దొంగిలించి, పిన్ కొట్టినా, వాళ్లు డబ్బును డ్రా చేయకుండా ఇది రక్షణ కవచంగా పనిచేస్తుందని బ్యాంక్ అంటోంది. SBI ప్రకారం, ATM దగ్గర డబ్బును తీసుకోవాలంటే ఖాతాదారులు OTPని నమోదు చేయాలి.
OTP అనేది సిస్టమ్ రూపొందించిన నాలుగు అంకెల సంఖ్య, ఇది కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వెళ్తుంది. అది నమోదు చేస్తేనే డబ్బును తీసుకోగలరు. ఇంకో సంగతి, ఒక లావాదేవీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు ఎన్నిసార్లు డబ్బును తీసుకొంటే అన్నిసార్లు ఓటీపీని నమోదుచేయాల్సిందే.
SBI ATMలలో ఒక లావాదేవీలో ₹ 10,000, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసే కస్టమర్‌లు లావాదేవీని పూర్తి చేయాలంటే OTP తప్పనిసరి.
OTPతో క్యాష్ ఎలా డ్రా చేయాలి?
SBI ATMలో నగదును విత్‌డ్రా చేయాలంటే డెబిట్ కార్డు ఒక్కటే సరిపోదు. బ్యాంక్ తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. అంటే ఎవరికార్డు మీద వాళ్లే డబ్బును విత్ డ్రా చేయగలరు.
ATMలో పిన్‌ను నమోదు చేసిన తర్వాత, మీ మొబైల్ కు SMS లో OTP వస్తుంది.
ATM స్క్రీన్‌పై OTPని నమోదు చేయాలి
OTP కరెక్ట్ గా ఉంటే క్యాష్ ను తీసుకోగలరు.