Star MAA : ఓటిటి హవాలోనూ శాటిలైట్ దూకుడు

ఓటిటిలు వచ్చాక శాటిలైట్ ఛానెళ్ల వైభవం తగ్గిన మాట వాస్తవం. కొత్త సినిమాలు డిజిటల్ లో నెల రోజులకే వస్తుంటే ఛానల్ లో మాత్రం ఇంకో నలభై యాభై రోజుల దాకా వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటిదాకా ఎదురు చూసే ఓపిక లేని జనం స్మార్ట్ స్క్రీన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీటివల్ల మార్కెట్ పూర్తిగా ప్రభావితం కాలేదు కానీ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్న క్లూ అయితే ఇచ్చింది. యాడ్స్ తో పాటు సమయాన్ని అదనంగా కేటాయించి మరీ టీవీలో మూవీస్ చూడటం కన్నా బోర్ కొట్టినప్పుడు హ్యాపీగా ఫార్వార్డ్ ఆప్షన్ ఉన్న ఓటిటి యాప్స్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళ సంఖ్య లక్షల నుంచి మెల్లగా కోట్లవైపు పరుగులు పెడుతోంది.

ఇక మ్యాటర్ కు వస్తే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ల విషయంలో అధిక పోటీ జెమిని, స్టార్ మా మధ్య ఉన్న సంగతి తెలిసిందే. జీ తెలుగు కూడా రేస్ లో ఉంది కానీ ఈ స్థాయి దూకుడు లేదన్న మాట వాస్తవం. ముఖ్యంగా స్టార్ మా గతంలో ఎన్నడూ లేనంత దూకుడు చూపిస్తూ హక్కులు సొంతం చేసుకునే విషయంలో తన తర్వాతే ఎవరైనా అనేలా దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్, లైగర్, సర్కారు వారి పాట లాంటి పాన్ ఇండియా సినిమాలు ఆల్రెడీ తన ఖాతాలో ఉన్నాయి. రామారావు ఆన్ డ్యూటీ, భీమ్లా నాయక్ లాంటి నిర్మాణంలో ఉన్న క్రేజీ మూవీస్ ని కొనేసింది. పుష్ప పార్ట్ 1, అఖండల కోసం చూస్తున్న టీవీ ఆడియన్స్ భారీగా ఉన్నారు. ఖిలాడీ వెయిటింగ్ లో ఉంది.

ధనుష్ మారన్, బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ బ్రహ్మాస్త్ర అన్ని భాషలకు డీల్ కుదుర్చుకుంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం బ్లాక్ బస్టర్లే కావడం గమనార్హం. గత ఏడాది టాప్ హిట్స్ గా నిలిచిన లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు స్టార్ మాలోనే గట్టి రేటింగ్స్ తెచ్చుకున్నాయి. కమల్ హాసన్ చేస్తున్న విక్రమ్ దీని చేతిలోనే ఉంది. ఈ లెక్కన చూస్తే జెమిని ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతోందిగా. జీ తెలుగు కూడా పోటీ పడుతోంది కానీ మరీ ఇంతలా కాదు. డిజిటల్ ట్రెండ్ ఇంత ఉదృతంగా ఉన్న టైంలోనూ శాటిలైట్ ఛానల్స్ ఇలా పోటీ పడటం నిర్మాతలకు మేలు చేసేదే

Also  Read : Bheemla Nayak : అందరి చూపు పవన్ సినిమా వైపు

Show comments