iDreamPost
android-app
ios-app

మహేష్ ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో ఎప్పట్నుంచో తెలుసా??

  • Published May 28, 2022 | 8:25 AM Updated Updated May 28, 2022 | 8:25 AM
  • Published May 28, 2022 | 8:25 AMUpdated May 28, 2022 | 8:25 AM
మహేష్ ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో ఎప్పట్నుంచో తెలుసా??

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదల అయి భారీ కలెక్షన్లని కొల్లగొడుతుంది.

ఇప్పటికే కేవలం రెండు వారాల్లోనే రెండొందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం అంటే సరికొత్త రికార్డే. ఇక ఓవర్సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమా తన ప్రభంజనం చూపిస్తుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటేసింది. ఇక వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో మెల్లి మెల్లిగా థియేట్రికల్ రన్ తగ్గుతూ వస్తుంది. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

సాధారణంగా పెద్ద సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీకి రావాలని నిర్ణయించుకుంటున్నాయి. సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకొంచెం లేట్ గా కూడా రావొచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్ భారీ రేటుకు దక్కించుకుంది. దీంతో సర్కారు వారి పాట సినిమా అమెజాన్‌ లో జూన్‌ 10న లేదా జూన్‌ 24 నుంచి కానీ స్ట్రామింగ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet