iDreamPost
android-app
ios-app

అయిదు రోజుల్లో 160 కోట్లు.. రీజనల్ సినిమాతోనే మహేష్ విధ్వంసం..

  • Published May 17, 2022 | 4:40 PM Updated Updated May 17, 2022 | 4:40 PM
  • Published May 17, 2022 | 4:40 PMUpdated May 17, 2022 | 4:40 PM
అయిదు రోజుల్లో 160 కోట్లు.. రీజనల్ సినిమాతోనే మహేష్ విధ్వంసం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్రఖని విలన్ గా మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ పరశురామ్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్న సమయంలో కేవలం తెలుగు సినిమాగానే రిలీజ్ అయి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక రీజనల్ సినిమా ఇంత తక్కువ సమయంలో ఇన్ని కలెక్షన్స్ సాధించడం అంటే అది నిజంగా రికార్డే. దీంతో మరోసారి మహేష్ స్టామినా ఏంటో తెలుస్తుంది.

ఇక అమెరికాలో కూడా ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ సాధించి అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టిస్తుంది సర్కారు వారి పాట. ఈ కలెక్షన్స్ చూసి మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మహేష్ తన మ మ మాస్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ మెప్పించి కోట్లు కొల్లగొడుతున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet