iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం ఇంట్రస్టింగ్ అప్ డేట్.. రన్ టైం లాక్..!

  • Published Aug 06, 2024 | 11:53 AM Updated Updated Aug 06, 2024 | 11:53 AM

న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న రెండో చిత్రం సరిపోదా శనివారం. ఇందులో సూర్య పాత్రలో నటించాడు నాని. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే. మూవీ రన్ టైం లాక్ అయ్యింది.

న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న రెండో చిత్రం సరిపోదా శనివారం. ఇందులో సూర్య పాత్రలో నటించాడు నాని. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే. మూవీ రన్ టైం లాక్ అయ్యింది.

  • Published Aug 06, 2024 | 11:53 AMUpdated Aug 06, 2024 | 11:53 AM
సరిపోదా శనివారం ఇంట్రస్టింగ్ అప్ డేట్.. రన్ టైం లాక్..!

దసరా, హాయ్ నాన్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్‌లో ఉన్నట్లు న్యాచురల్ స్టార్ నాని. దసరా మూవీకి ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వర్సటైల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం. అంటే సుందరానికి ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే.. ఇప్పుడు మాస్ ఆడియన్స్ కోసం సరిపోదా శనివారాన్ని తీసుకువస్తున్నాడు. ఇది వింటేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతుంది. డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై డీవివి దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాకం మోహన్.. నానితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత వీరిద్దరు జత కట్టబోతున్నారు.

ఎస్ జెసూర్య, అభిరామి, ఆదితి బాలన్, పి సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేక సుధాకర్ నటించారు. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో సరిపోదా శనివారంగా రాబోతుండగా.. మిగిలిన భాషల్లో డబ్ కాబోతుంది. అలాగే సూర్యస్ సాటర్ డే పేరుతో రాబోతోన్నట్లు తెలుస్తుంది. హిందీ, మలయాళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ కానుంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా షూటింగ్ నిమిత్తం క్రియేట్ చేసిన సోకులపాలెం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

త్వరలో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నారు. అలాగే ప్రమోషన్లను కూడా స్టార్ చేయనుంది చిత్ర యూనిట్. హాయ్ నాన్నలాగానే ఇది కూడా పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో పలు ప్రాంతాల్లో సినిమా బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సరిపోదా శనివారం మూవీ రన్ టైం రివీల్ అయ్యింది. ఈ చిత్రం 2 గంటల 35 నిమిషాల రన్ టైంతో రాబోతుందని తెలుస్తుంది. అయితే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు సో ఇక్కడ కొంచెం మార్పు ఉండొచ్చుని లేదా అదే రన్ టైంతో రావచ్చునని తెలుస్తుంది. ఇక ఇందులో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. నాని మరోసారి డ్యూయల్ షేడ్స్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş