iDreamPost
iDreamPost
నిన్నటితో యాభై రోజులు పూర్తి చేసుకున్న మహేష్ బాబు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు అర్ధరాత్రి నుంచి ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు భారీ వ్యూస్ ఆశిస్తోంది సదరు సంస్థ. జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు కన్నా ఒక రోజు లేట్ గా రిలీజైన అల వైకుంఠపురములో రెండు రోజుల ముందే స్మార్ట్ ఫోన్లు టీవీల్లో ప్రత్యక్షం కాగా ఇందులోనూ రెండు పోటీ పడబోతుండటం విశేషం.
కలెక్షన్ల విషయంలో అలనే గెలిచినట్టు వసూళ్లు రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నప్పటికీ సరిలేరు టీమ్ మాత్రం తెలుగు రాష్ట్రాల నాన్ బాహుబలి రికార్డ్స్ తమవే అనే ప్రచారాన్ని మాత్రం మానడం లేదు. 60 కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ పూర్తయినట్టు చెబుతున్నారు. మరి బన్నీ సినిమా కౌంట్ ఇవాళ తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ యాభై రోజులు టచ్ కావడం ఆలస్యం ఇంత త్వరగా అందుబాటులోకి రావడం విశేషమే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్పుడే ఈ రెండు సినిమాల సెంటర్ల గురించి ఆన్ లైన్ లో చేయబోయే రచ్చ గురించి అభిమానులు మరోసారి పోలికల యుద్ధం మొదలుపెట్టేలా ఉన్నారు.
వసూళ్లు ఘనంగానే ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మహేష్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా సరిలేరు నీకెవ్వరుని ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. పండగ అడ్వాంటేజ్ లేక మాములు టైంలో వచ్చి దీనికి ఇంత గ్రాండ్ వెల్కమ్ దక్కేది కాదనే మరో అభిప్రాయం కూడా విశ్లేషకుల్లో ఉంది. ఏది ఏమైనా ఇంట్లోనే కూర్చుని ప్రశాంతంగా మంచి హెచ్డి క్వాలిటీలో సంక్రాంతి సినిమాలను ఎన్ని సార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకునే అవకాశం వచ్చేసింది. ఆ టైంలో రేస్ లో ఉన్న దర్బార్, ఎంత మంచివాడవురా వీటి కన్నా ముందే ఆన్ లైన్లో వచ్చేసిన సంగతి తెలిసిందే