Keerthi
Ooru Peru Bhairavakona OTT: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా గత కొన్నిరోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సైలెంట్ గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఎందులో అంటే..
Ooru Peru Bhairavakona OTT: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా గత కొన్నిరోజులుగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సైలెంట్ గా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఎందులో అంటే..
Keerthi
మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్పరణతో మారుమోగుతున్నాయి. మరోవైపు సినీ పరిశ్రమలో కూడా వరుస హిట్ సినిమాలు థియేటర్లలో రిలీస్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’ తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. మరో వైపు థియేటర్లలో ‘గామి’, ‘భీమ’ చిత్రలు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక ఈ సమయంలో.. అటు ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాగా, వాటిలో.. సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ వంటి రకరకాల సినిమాలు సినీ ప్రియులకు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అందులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ కూడా ఒకటి. కాగా, ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎటువంటి ప్రచారం లేకుండా ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఎందులో అంటే..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని డైరెక్టర్ వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమా గతనెల అనగా ఫిబ్రవరి 16వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది.అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా కాలం తర్వాత సందీప్ ఖాతాలో సూపర్ హిట్ పడింది.పైగా థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా ఓటీటీలో ప్రసారమవుతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మొదట ఈనెల 15వ తేదీన ఓటీటీలో ప్రసారం కానుందని టాక్ వినిపించగా.. ఆ వార్త పై అధికార ప్రకటన రాలేదు. అయితే సడన్ గా ఇప్పుడు సందీప్ కిషన్ మూవీ ఎటువంటి ప్రచారం లేకుండా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఇప్పటి వరకు థియేటర్లలో మిస్ అయిన ఊరు పేరు భైరవకోన సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.
ఇక ఊరు పేరు భైరవకోన కథ విషయానికొస్తే.. భైరవకోన అనే గ్రామం చాలా విచిత్రం. ఈ ఊర్లోకి అడుగుపెట్టిన వాళ్లు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చిన దాఖాలాలు లేవు. అలాంటి గ్రామంలోకి సందీప్ తన స్నేహితులతో కలిసి అడుగుపెడతారు.ఈ క్రమంలోనే దొంగతనం చేసి పోలీసులకు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఊర్లోకి చేరతాడు సందీప్. అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ ?.. అసలు భైరవకోన గ్రామంలో ఏం జరుగుతుంది ? గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీలతో భైవరకోన గ్రామానికి ఉన్న సంబంధం ఏంటీ ? సందీప్ కిషన్ తన స్నేహితులతో కలిసి ఎలా బయటపడ్డాడు ? అనేది ఈ సినిమా కథ. ఇక ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలియాలంటే అలస్యం చేయకుండా ఊరు పేరు భైరవ కోన సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియాలో చూసేయాల్సిందే. మరి, సడెన్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఊరు పేరు భైరవకోన సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.