iDreamPost
iDreamPost
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నార లోకేష్ కి మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ మాన్సాస్ ట్రస్ట్ పై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే మాన్సాస్ చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును ఆ పదవి నుండి తొలగించినప్పటి నుంచీ ఈ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని దీనికి జగన్ సర్కారే కారణం అని, విజయనగరం పూసపాటి వంశీయుల మహారాజ పోషణ సంస్థ మాన్సాస్ జగన్ సర్కారు కుతంత్ర రాజకీయాలకు వేదికగా మారడం విచారకరమని తన ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేశారు.
అయితే నారాలోకేష్ చేసిన ట్వీట్ పై సంచయిత గజపతి రాజు స్పందిస్తు, హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన ఇంట్లో కూర్చొని మాన్సాస్‌కు తొలిసారి ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఓ మహిళపై అబద్ధాలు చెప్పడాన్ని చంద్రబాబు గారు, నారా లోకేష్ మానుకోవాలని, వీరిద్దరూ దిగజారిపోయి పార్టీ కార్యకర్తలతో అసత్యాలు ప్రచారంచేయిస్తున్నారని , నిజానికి ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మాన్సాస్ ఉద్యోగులకి జీతాలు విడుదల చేశామని, తెలుగుదేశం నేతలకి సరైన సమాచారం లేకుండా మాటాడుతున్నారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అశోక్ గజపతి రాజు హయాంలోనే వారి అనాలోచిత అస్తవ్యస్థ విధానాల వల్ల మాన్సాస్ సంస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విద్యాసంస్థలకు రావాల్సిన రూ.20కోట్లు 2016 నుంచి ప్రభుత్వం బకాయిపడ్డా, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నాకూడా ఒక్కరూపాయి ఇప్పించుకోలేకపోయారని చెప్పుకొచ్చారు.
అలాగే రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి లేకుండా అశోక్ గజపతి రాజు గారు 2018–20లో 170 మంది విద్యార్థులకు బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చారని, దీనివల్ల వారి డిగ్రీలు చెల్లకుండా పోయాయని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిన సమయంలో తాను వచ్చాకే ఈసమస్యను పరిష్కరించడం జరిగిందని, ఈ విషయాలు చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు.!