Samyuktha Menen : భీమ్లా నాయక్ ప్రభావం గట్టిగానే ఉంది

హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉన్న టాలీవుడ్ లో కొంత పేరొస్తే చాలు ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. పెళ్లిసందD ఫ్లాప్ అయినా శ్రీలీలకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడటం చూస్తున్నాం. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ధమాకాతో పాటు ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసిందని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ లో రానాకు జోడిగా నటించిన సంయుక్త మీనన్ కు మెల్లగా కాల్స్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సర్ లో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. అందులో తనకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ దొరికిందని ఇన్ సైడ్ టాక్.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో చాలా కీలమైన చెల్లెలి పాత్ర సంయుక్తనే తీసుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ముందు సాయిపల్లవి అనుకున్నారు కానీ తను ఒప్పుకోకపోవడంతో అది కాస్తా ఈ అమ్మడికి చేరిందని తెలిసింది. భీమ్లా నాయక్ లో తన నటన చూసే త్రివిక్రమ్ లాక్ చేసుకున్నారని వినికిడి. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ఇది పూజా హెగ్డే సిస్టర్ క్యారెక్టరని అంటున్నారు. అరవింద సమేత వీర రాఘవలో ఇలాంటి పాత్రే ఈషా రెబ్బ చేయడం ఇంకా గుర్తే. దాని వల్ల తనకు పెద్ద ప్రయోజనం కలగలేదు. కానీ ఇందులో మాత్రం సంయుక్త మీనన్ రోల్ అలా ఉండకపోతేనే బెటర్

మలయాళంలో 2016 నుంచి కెరీర్ కొనసాగిస్తున్న సంయుక్తకు తెలుగు తమిళంలో ఇప్పుడు బ్రేక్ దొరుకుతోంది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ అమ్మాయికి భీమ్లా నాయక్ కూడా డైరెక్ట్ గా రాలేదు. ముందు ఎంపిక చేసిన ఐశ్వర్య రాజేష్ ఏవో కారణాల వల్ల డ్రాప్ కావడంతో ఆ స్థానంలో సంయుక్త వచ్చింది. ఇదయ్యాకే సర్ ఛాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు. ఓవర్సీస్ ప్రీమియర్లు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకొద్ది రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. అనూహ్యమైన పరిస్థితులు వస్తే తప్ప వాయిదా పడే ఛాన్స్ లేదు.

Also Read : Akhanda : బ్లాక్ బస్టర్ పరుగు ఫినిషింగ్ లో బాలయ్య

Show comments