iDreamPost
android-app
ios-app

బింబిసార 2 ఇష్యూ! సీక్వెల్ కోసం ఆ పొజిషన్ రీప్లేస్ చేయబోతున్నారా?

  • Author ajaykrishna Published - 09:26 AM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 09:26 AM, Tue - 8 August 23
బింబిసార 2 ఇష్యూ! సీక్వెల్ కోసం ఆ పొజిషన్ రీప్లేస్ చేయబోతున్నారా?

నందమూరి కళ్యాణ్ రామ్.. హీరోగా గతేడాది ‘బింబిసార’తో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సోషియోఫాంటసీ, టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం అందుకుంది. పైగా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా బింబిసార నిలిచింది. చాలకాలం తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ ని ఫామ్ లోకి తీసుకొచ్చింది ఈ సినిమా. దీంతో సినిమా సక్సెస్ కాగానే.. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు హీరో కం ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్. దర్శకుడు వశిష్ఠ సైతం సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. వీలైనంత త్వరగా బింబిసార సీక్వెల్ తెరపైకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా అనుకున్నాడు.

ఇలాంటి తరుణంలో దర్శకుడు వశిష్ఠ.. తన తదుపరి ప్రాజెక్ట్ ని మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశాడని తెలుస్తోంది. మరోవైపు కళ్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ ని ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తున్నాడట. అందుకు కారణం కూడా లేకపోలేదు. బింబిసార ఓటిటి హక్కులు కొనుగోలు చేసిన జీ స్టూడియోస్ వారు.. సీక్వెల్ కి థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి దాదాపు రూ. 100 కోట్ల వరకు ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ ఆలోచన చేస్తుండగా.. డైరెక్టర్ మెగాస్టార్ తో సినిమా ప్లాన్ చేసేసరికి విభేదాలు తలెత్తాయని టాక్ నడుస్తోంది.

రీసెంట్ గా బింబిసార విడుదలై ఏడాది పూర్తి కావడంతో డైరెక్టర్ వశిష్ఠ.. స్పెషల్ పోస్ట్ పెట్టాడు. కళ్యాణ్ రామ్ తో పాటు సినిమాకు వర్క్ చేసిన అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. కట్ చేస్తే.. కళ్యాణ్ రామ్ బింబిసార గురించి అసలు రియాక్ట్ అవ్వలేదు. నిజంగానే వీరి మధ్య విభేదాలు ఉన్నాయేమో అనే వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. తాజా సమాచారం ప్రకారం.. బింబిసార సీక్వెల్ కి డైరెక్టర్ ని మార్చబోతున్నారని టాక్. వశిష్ఠ ప్లేస్ లో.. ‘రొమాంటిక్’ మూవీ తెరకెక్కించిన అనిల్ పూడూరి ఎంటర్ అవుతాడని వినిపిస్తుంది. ఇతనే ఎందుకంటే.. బింబిసారకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా వర్క్ చేశాడు అనిల్. సో.. ఇతనిపై కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నాడని వినికిడి. ప్రస్తుతం టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ బింబిసార 2 వేరేవరు చేసినా.. వశిష్ఠ ఇంకో సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది. మరి త్వరలోనే బింబిసార సీక్వెల్ పై హీరో, డైరెక్టర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet