iDreamPost
iDreamPost
మలయాళంలో మొన్న విడుదలైన కడువా తెలుగు డబ్బింగ్ కూడా అదే రోజు ప్లాన్ చేశారు. కానీ ఏవో కారణాల వల్ల రెండు రోజులు వాయిదా వేసి నిన్నా ఈ రోజు అంటూ మొత్తానికి రిలీజ్ అయ్యిందో లేదో తెలియని అయోమయాన్ని సృష్టించారు. మనకు అంతగా పరిచయం లేని పృథ్విరాజ్ సుకుమారన్ హీరో కావడంతో అంచనాలు కూడా పెద్దగా ఏం లేవు. ఇంతకీ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ చూద్దాం
చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కడువాకునేల్ కురియతన్ చేతన్(పృథ్విరాజ్). ఆ ఊరిలో తన బలం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఇలాంటి శక్తివంతుడితో ఢీ కొట్టేందుకు వస్తాడు ఐజి థామస్(వివేక్ ఒబెరాయ్). అప్పటిదాకా తిరుగులేని శక్తిగా రాజ్యమేలుతున్న కడువాకు అతనికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ క్లాష్ ఎందుకు వచ్చింది, వీళ్ళ వెనుక ఉన్న అసలు కథేంటి అనేది తెరమీదే చూడాలి.
కడువా తెలుగంటే లోకువా?
పృథ్విరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ అతని అభిమానులకు మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. ఇది రొటీన్ టెంప్లేట్ లో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా మెప్పించినప్పటికీ సెకండ్ హాఫ్ లో దర్శకుడు షాజీ కైలాష్ చేతులెత్తేశారు. ఏం జరగబోతోందో ముందే ఊహించేలా కథనం నడవడం ప్రధాన మైనస్. హీరోయిన్ సంయుక్త మీనన్ తో సహా కీలక క్యాస్టింగ్ ని సరిగా వాడుకోలేదు. రెగ్యులర్ గా చూసే మాస్ స్టఫ్ తో అడ్జస్ట్ అవుతాం అనుకుంటే తప్ప థియేటర్ కు అదే పనిగా వెళ్లేంత మ్యాటర్ కడువాలో లేదు. ఓటిటి కోసం వెయిట్ చేయొచ్చు