iDreamPost
android-app
ios-app

సార్‌ టీజర్‌ వచ్చేసింది! మోర్ ఫీజ్, మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్, విద్యా వ్యవస్థపై ధ‌నుష్ విసుర్లు

  • Published Jul 28, 2022 | 7:46 PM Updated Updated Jul 29, 2022 | 2:05 PM
సార్‌ టీజర్‌ వచ్చేసింది! మోర్ ఫీజ్, మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు  ట్రెండ్, విద్యా వ్యవస్థపై ధ‌నుష్ విసుర్లు

స్టార్‌ హీరో ధనుష్ హీరోగా న‌టిస్తున్న‌నటిస్తున్న తాజా చిత్రం సార్‌. ఇది ధ‌నుష్ కి తెలుగు స్ట్రైయిట్ మోవీ. వెంకీ అట్లూరి డైరెక్ట‌ర్. ఈ మూవీ తమిళంలో వాత్తిగా రిలీజ్‌ కానుంది. ధనుష్‌ బర్త్‌డే కి సార్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌.

జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్‌.. మోర్‌ ఫీజు.. మోర్‌ ఎడ్యుకేషన్‌.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్‌.. అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలువుతుంది. టీజర్‌లో ధనుష్‌ పాత్రను రివీల్‌ చేశారు. పేరు బాలగంగాధర్‌ తిలక్. జూనియర్‌ లెక్చరర్‌గా నటించాడని హీరోనే చెప్పాడు. ‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్‌.. పంచండి, ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో డిష్‌లాగా అమ్మకండి’ అని హీరో చెప్పే డైలాగ్ మాస్ కి బాగా న‌చ్చింది. టీజర్‌లో విద్యా వ్య‌వ‌స్థ మీద చాలా విసుర్లు, విమ‌ర్శ‌లు గ‌ట్టిగానే ఉన్నాయి. యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషించిన సార్ సినిమాకు, జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ధనుష్‌కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్‌ ఫిలిం కావడంతో సార్ మూవీ మీద చాలా అంచ‌నాలే ఉన్నాయి. సామాజిక దృక్ప‌థం ఉన్న సినిమాల్లో న‌టించే ధ‌నుష్ సార్ మీద చాలా న‌మ్మ‌క‌మే పెట్టుకున్నారు.