iDreamPost
iDreamPost
రాజావారు రాణిగారుతో పరిచయమై ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే. గోపినాధ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కరోనా వల్ల రెండు మూడు తేదీలు మారాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 24 విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఇండిపెండెంట్ మూవీస్ లో కనిపించే కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి ఇందులో హీరోయిన్. గతంలో వచ్చిన టీజర్ పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో యూత్ నుంచి మంచి సపోర్ట్ దక్కుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది.ఇందాక హైదరాబాద్ లో టీమ్ సభ్యులు ట్రైలర్ ని లాంచ్ చేశారు. అదెలా ఉందో చూద్దాం.
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో కృష్ణ(కిరణ్ అబ్బవరం)తండ్రి దగ్గరే పెరుగుతాడు. ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదని త్వరగా పెళ్లి చేసుకునేందుకు తొందపడుతూ ఉంటాడు. వయసొచ్చాక సంబంధానలు చూడటం మొదలుపెడతాడు. అప్పుడు పరిచయమైన అమ్మాయే శాన్వి(చాందిని చౌదరి). మొదట్లో నచ్చినా పోను పోను ఆమెకు సిగరెట్, మందు తాగే అలవాటు ఉందని అర్థమయ్యాక షాక్ తింటాడు. తనకు ఇష్టం లేనివి అవి. అయినా సర్దుకుంటాడు. కానీ క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ కాస్తా కొన్ని అపార్థాలకు దారి తీస్తుంది. ఈ జంట ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఒకటయ్యారు లాంటివి తెలియాలంటే వచ్చే శుక్రవారం దాకా ఆగాలి.
సినిమా మొత్తం లీడ్ పెయిర్ మీద నడిపించినట్టు కనిపిస్తోంది. ఇతర ఆర్టిస్టులు అక్కడక్కడా తప్పించి పెద్దగా హైలైట్ అవ్వలేదు. లైన్ సింపుల్ గా గతంలో చూసినట్టుగా అనిపించినా టేకింగ్ లో ఫ్రెష్ నెస్ ఉంది. కిరణ్ చాందిని జంట కూడా బాగానే ఉంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ హృద్యంగా ఉంది. సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణం అందించగా రచనతో పాటు కథ స్క్రీన్ పే బాధ్యతలు అన్నీ గోపినాథ్ రెడ్డినే చూసుకున్నారు. హీరో పాత్రకున్న తల్లి సెంటిమెంట్ కొంత విశ్వక్ సేన్ పాగల్ కు దగ్గరగా అనిపించినా ఫైనల్ గా చెప్పాలంటే యూత్ కి కనెక్ట్ అయ్యే ట్రీట్ మెంట్ అయితే చేసుకున్నారు. సరిగ్గా కనెక్ట్ అయితే హిట్టే లేదంటే చిక్కే