Bholaa Shankar : ఇద్దరి సినిమాల్లో ఒకటే సెంటిమెంట్ – వాట్ టు డూ

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోయే వేదాళం రీమేక్ భోళాశంకర్ గురించి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కారణం ఇటీవలే రిలీజైన పెద్దన్న అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే రెండు సిస్టర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని ఆ థ్రెడ్ మీద నడిచే యాక్షన్ డ్రామాలు. ఈ రెండు సినిమాల్లోనూ కీర్తి సురేష్ చెల్లెలిగా నటించింది. సూపర్ స్టార్ మెగాస్టార్ ఇద్దరూ ఇంచుమించు ఒకే స్టామినా రేంజ్ కలిగిన హీరోలు. అలాంటప్పుడు సహజంగానే పోలిక వస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పెద్దన్న దర్శకుడే వేదాళం తీసింది. అందులో కూడా రొటీన్ మాస్ హీరోయిజంతో పాటు ఓవర్ ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి.

అజిత్ ఇమేజ్ పుణ్యమాని దాని స్థాయి కంటే అది ఎక్కువే ఆడింది. ఇప్పుడు ఆ సినిమానే చిరంజీవి ముచ్చటపడి మరీ తీసుకుంటున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేశారు. పెద్దన్న ఫలితం చూశాక అంతో ఇంతో మార్పులు అవసరం అనిపించే అవకాశం లేకపోలేదు. పెద్దన్నతో పోల్చి ఒక్క సీన్ సేమ్ ఉన్నా చాలు కామెంట్లు వచ్చి పడతాయి. విచిత్రంగా వేదాళంలోనూ కోల్కతా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అదొక్కటే తేడా. అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ కు చిరుకి వ్యత్యాసం ఉంటుంది. పైగా ఇక్కడ అభిమానుల అంచనాలు వేరే రకంగా ఉంటాయి. అందుకే మెహర్ రమేష్ ఎలాంటి చేంజ్ చేశారన్నది చాలా కీలకంగా మారబోతోంది

ఒకటి మాత్రం స్పష్టం. ప్రేక్షకులు మరీ రొటీన్ గా ఉంటే ఏ హీరో సినిమానైనా తిప్పి కొడుతున్నారు. అది వినయ విధేయ రామ కావొచ్చు పెద్దన్న కావొచ్చు. ఓపెనింగ్ ఫిగర్స్ ఘనంగా ఉండొచ్చేమో కానీ ఓవరాల్ గా రిజల్ట్ మాత్రం డిజాస్టర్ పడుతోంది. ఇప్పుడు భోళా శంకర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. గతంలో పటాస్ టెంపర్ ఇంచుమించు ఒకే పాయింట్ తో వచ్చినా జనం ఆదరించి హిట్ చేశారు. కానీ ఇప్పుడలా కాదు. పెద్దన్న ఆల్రెడీ ఫ్లాప్ అయ్యింది. మరి భోళా శంకర్ ఏం చేస్తాడో

Also Read : Mega154 : వింటేజ్ లుక్ లో మెగా 154 ప్రారంభం

Show comments