iDreamPost
android-app
ios-app

సమంతా ధైర్యానికి మరో మెట్టు శాకుంతలం

  • Published Jan 10, 2023 | 1:59 PM Updated Updated Dec 19, 2023 | 3:22 PM

గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఇతిహాస గాధతో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా పరిచయమవుతున్నాడు.

గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఇతిహాస గాధతో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా పరిచయమవుతున్నాడు.

  • Published Jan 10, 2023 | 1:59 PMUpdated Dec 19, 2023 | 3:22 PM
సమంతా ధైర్యానికి మరో మెట్టు శాకుంతలం

ప్రమాదకరమైన మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ నెలల తరబడి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న సమంతా ఎట్టకేలకు శాకుంతలం ట్రైలర్ రిలీజ్ కోసం నిన్న ఈవెంట్ కి విచ్చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఇతిహాస గాధతో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా పరిచయమవుతున్నాడు. దుశ్యంతుడు శకుంతల ప్రేమకథగా మొదలై భరత రాజ్య స్థాపన దాకా జరిగిన కథా క్రమాన్ని ఇందులో చూపించబోతున్నారు. దుర్వాస మహర్షి శాపం, నిండు గర్భవతిగా శకుంతల ఎదురుకున్న అవమానాలు అన్నీ పొందుపరిచారు. యుద్ధ ఘట్టాలు పోరాటాలు కూడా ఉన్నాయి.

నిజానికి సామ్ పూర్తిగా కోలుకోలేదు. మూడేళ్ళ పాటు కోట్ల బడ్జెట్ తో నిర్మాణంలో ఉన్న శాకుంతలం వచ్చే నెల 17న విడుదల కాబోతోంది. నలభై రోజులు కూడా లేకపోవడంతో పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. దీని కోసం గుణశేఖర్ పడిన కష్టం దగ్గరి నుండి చూసిన సమంతా ఆయన కోసమే వచ్చినట్టుగా చెప్పింది. స్పీచ్ జరుగుతున్న టైంలో ఇద్దరూ భావోద్వేగాలకు లోనై పరస్పరం కన్నీళ్లు పెట్టుకోవడం చూపరులను కదిలించింది. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా మీమర్స్ సామ్ పూర్తిగా చిక్కిపోయిందని మునుపటి అందం లేదనే తరహాలో అర్థం లేని కథనాలు వడ్డించడంతో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు

Samantha Shaakuntalam

యశోద రిలీజప్పుడు హాస్పిటల్ లో ఉన్న సమంతా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయినా సినిమా మంచి విజయం సాధించింది. దాని బడ్జెట్ బిజినెస్ రెండు తక్కువ కావడం ఇబ్బంది రాలేదు. కానీ శాకుంతలం అలా కాదు. కేవలం ఈమె ఇమేజ్ మీదే ఇంత పెట్టుబడి పెట్టారు. అందుకే గుణశేఖర్ ప్రత్యేకంగా సూపర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. రుద్రమదేవి తర్వాత హిరణ్యకశిప తీసేందుకు ప్రయత్నించిన ఈ జీనియస్ డైరెక్టర్ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. శాకుంతలం బడ్జెట్ చేయిదాటిపోతున్నప్పుడు దిల్ రాజు చేయూతనందించి పూర్తి చేయించారు. విజువల్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం సమంతాలో ఉంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss