iDreamPost
android-app
ios-app

జైలు పాలైన జయప్రద బద్ద శత్రువు

జైలు పాలైన జయప్రద బద్ద శత్రువు

సమాజ్ వాదీ పార్టీ ఎంపి మొహద్ అజం ఖాన్, అతని భార్య, కొడుకు బుధవారంపోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన తరువాత జైలుకు పంపబడ్డారు. ఖాన్ కుటుంబం పలు కేసుల్లో సమన్లు ​​విస్మరించినందువల్ల వారిపై వారెంట్లు జారీ చేయబడ్డాయి.

అజామ్ ఖాన్ కుటుంబంపై దాఖలు చేసిన వివిధ కేసులలో కోర్టులు జారీ చేసిన సమన్లను ​​విస్మరించిన నేరానికి వారిపై వారెంట్లు జారీ చేయబడ్డాయి.దీంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపి అజామ్ ఖాన్, అతని భార్య తంజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజామ్‌లను బుధవారం జిల్లా కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన అనంతరం వారిని ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 2 న జరగనుంది.

అజామ్ ఖాన్ ముందస్తు బెయిల్ పొందడానికి అనేక ప్రయత్నాలు చేసాడు కాని ఆ ప్రయత్నాలను కోర్టు ఖండించింది.దానితో పాటు అజామ్ ఖాన్, టాంజీన్ ఫాతిమా, అబ్దుల్లా అజామ్‌ల ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

గత సంవత్సరం అజామ్ ఖాన్ కుటుంబ సభ్యులపై 4కి పైగా కేసులు నమోదయ్యాయి. అతని కుమారుడిపై ఫోర్జరీ కేసు నమోదయ్యింది. భూ కబ్జా, ఆక్రమణ, విద్యుత్ చౌర్యం, విగ్రహం దొంగతనం, గేదె, మేక దొంగతనం వంటి పలు కేసులు అజామ్ ఖాన్ పై నమోదు చేయగా, అతని కుమారుడు అబ్దుల్లా అజామ్ పుట్టిన తేదీ పత్రాల్లో ఫోర్జరీకి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. అతను ఫోర్జరీకి పాల్పడినట్లు రుజువు కావడంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయాడు.

సినీనటి జయప్రదకును సమాజ్ వాదీ పార్టీ నుండి బయటకు వెళ్లగొట్టడంలో అజామ్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒకప్పటి తన శిష్యురాలు,బద్ద శత్రువైన జయప్రదపై విజయం సాధించారు. జయప్రదను సమాజ్ వాదీ పార్టీ నుండి బయటకు పంపించిన వ్యక్తిగా అజామ్ ఖాన్ వార్తల్లో నిలిచారు. కానీ నేడు పలు కేసుల్లో సమన్లను విస్మరించినందు వల్ల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులకు లొంగిపోయారు.