iDreamPost
android-app
ios-app

ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌! పోలీసుపై బదిలీ వేటు..

ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌! పోలీసుపై బదిలీ వేటు..

ప్రభుత్వ ఉద్యోగులు.. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. సస్పెండ్ చేయడం, జరిమాన విధించడం వంటి శిక్షలు వేస్తారు. ఇప్పటికే ఇలా శిక్షలకు గురైన అధికారులు ఎందరో  ఉన్నారు. అలానే తాజాగా ముఖ్యమంత్రి ముందు నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు ఓ పోలీసుకి కూడ ఉన్నతాధికారులు షాకిచ్చారు. ఫోన్ లో మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన పోలీసులపై బదిలీ వేటు వేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించడానికి శుక్రవారం బయలు దేరారు. హెలికాప్టర్ ద్వారా హరిద్వార్‌ నుంచి గ్రాస్తాన్‌గంజ్‌కు వెళ్లారు. అదే సమయంలో  ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే అదనపు పోలీసు సూపరింటెండెంట్ అధికారి శేఖర్‌ సుయాల్‌ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సీఎం హెలికాఫ్టర్‌ దిగగానే ఏఎస్పీ శేఖర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సెల్యూట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సీఎంకే మర్యాద ఇవ్వని వ్యక్తి.. ప్రజలకు ఏమిస్తాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలా విధుల్లో నిర్లక్ష్యం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే ఆ రాష్ట్రా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు క్రమశిక్షణ చర్యల కింద ఏఎస్పీని బదిలీ చేశారు. ప్రస్తుతం అతడు పనిచేస్తున్న స్థానం నుంచి నరేంద్ర నగర్‌లోని పోలీసు శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఏఎస్పీగా జై బలూని కోట్‌ద్వార్‌లో నియమించారు. ఈ సంఘటన ఆగస్టు 11న జరిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అనేక మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 74కు పెరిగింది. ఇలా భారీ వరదల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మీ బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ లో ఉందా? ఒక్క సైన్ తో ఇలా బయటపడండి!