iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇదే

  • Published Oct 13, 2022 | 3:50 PM Updated Updated Oct 13, 2022 | 3:50 PM
  • Published Oct 13, 2022 | 3:50 PMUpdated Oct 13, 2022 | 3:50 PM
రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇదే

ముప్పై అయిదేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటించని కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో మాత్రం అడగ్గానే చిన్న క్యామియో చేయడం ఫ్యాన్స్ కు స్వీట్ షాక్ లాంటిది. దానివల్ల పెదరాయుడులో రజనీకాంత్ రేంజ్ లో ప్లస్ అవ్వలేదు కానీ నార్త్ మార్కెట్ పరంగా, ప్రాజెక్టు మీద క్రేజ్ వచ్చే కోణంలో మంచి జరిగిన మాట వాస్తవం. నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఇవ్వాలని చూసినా మొహమాటం లేకుండా తిరస్కరించి కేవలం చిరు చరణ్ ల మీద ప్రేమతోనే ఈ క్యారెక్టర్ చేస్తున్నాను తప్ప దాన్ని డబ్బుతో కొనలేరని పైసా తీసుకోకుండా స్వంత ఖర్చులతో నటించిన సంగతి ఆల్రెడీ తెలిసిందే. మరి ఏదో ఒకటి బదులు ఇవ్వాలిగా.

దీనికి ప్రతిగా సల్మాన్ ఖాన్ కు త్వరలో రామ్ చరణ్ ఒక ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడని కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే అదీ నిజం కాదని ఫ్రెష్ అప్డేట్. అసలు సొమ్మే వద్దన్నోడు వస్తువు మాత్రం ఎందుకు తీసుకుంటాడు. ఆ బదులు కానుక ఏంటంటే సల్లు భాయ్ కొత్త మూవీ కిసికా భాయ్ కీసికా జాన్ మూవీలో అచ్చం సల్మాన్ టైపులోనే రామ్ చరణ్ అతిథి పాత్ర చేయడం. దీని తాలూకు షూట్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే పూర్తయ్యింది. ఈ విషయం ముంబై ప్రెస్ మీట్ లో సల్మాన్ చెప్పేశాడు కానీ ఆ హడావిడిలో మీడియా దాన్ని కొంచెం లైట్ తీసుకుంది. సో ఇచ్చిపుచ్చుకోవడం ఇలా పాత్రల రూపంలో జరిగిపోయింది.

కిసీకి బాయ్ కిసీకి జాన్ లో సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఆమెకు అన్నయ్యగా ఓ ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. వెంకీ సల్మాన్ చరణ్ ముగ్గురూ కలిసే ఫ్రేమ్ కూడా ఒకటి ఉంటుందట. డిసెంబర్ చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేసుకున్న ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ మీద ఫ్యాన్స్ కి గట్టి ఆశలే ఉన్నాయి. 2023 జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ తో రాబోతున్నాడు. దానికన్నా ముందు తమ హీరో బ్లాక్ బస్టర్ సాధించాలని వాళ్ళ కోరిక. ఆల్రెడీ చరణ్ ఆర్ఆర్ఆర్ ద్వారా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడీ మూవీలో తళుక్కున మెరవడం ద్వారా వాళ్లకు మరింత దగ్గరయ్యే ఛాన్స్ దొరికింది

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom