iDreamPost
android-app
ios-app

రామ్ ఇలా – నితిన్ అలా

రామ్ ఇలా – నితిన్ అలా

యూత్ హీరోలు ఎంత స్పీడ్ గా దూసుకుపోవాలన్నా ఒక్కోసారి డిజాస్టర్లు వేసే స్పీడ్ బ్రేకర్లు మాములుగా ఉండవు. సడన్ గా ఆగిపోయి చేస్తున్నది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నితిన్, రామ్ ల పరిస్థితి అలాగే ఉంది. ముందు నితిన్ సంగతి చూస్తే మాచర్ల నియోజకవర్గం ఇచ్చిన షాక్ ఓ రేంజ్ లో ఉండటంతో దీని తర్వాత దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్న ప్రాజెక్టుకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారట. సెకండ్ హాఫ్ కు సంబంధించి ఫైనల్ వెర్షన్ ఎందుకో అసంతృప్తిగా అనిపించడంతో టీమ్ మొత్తం మళ్ళీ డిస్కస్ చేసుకుని తర్వాత కంటిన్యూ చేద్దామని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే ఫారిన్ షెడ్యూల్ లో ఓ పాట కూడా షూట్ చేసినట్టు సమాచారం.

అల్లు అర్జున్ నా పేరు సూర్యతో దర్శకుడిగా మారిన వక్కంతంకు దాని ఫలితం వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. స్టార్ రైటర్ గా ఇంత బ్రేక్ కేవలం ఒక ఫెయిల్యూర్ తీసుకొచ్చింది. అందుకే ఇంతకాలం ఆగి ఫైనల్ గా నితిన్ ని ఒప్పించగలిగాడు. తీరా మాచర్ల రిజల్ట్ చూశాక ఓవర్ మాస్ గా వెళ్తే జరిగేదేంటో ఇద్దరికీ అర్థమైనట్టు ఉంది. ఇక రామ్ విషయానికి వస్తే బోయపాటి శీను డైరెక్షన్ లో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి హీరోయిన్ ఎంపిక పూర్తయ్యిందట. ఏజెంట్ తో అఖిల్ సరసన పరిచయమవుతున్న సాక్షి వైద్యను లాక్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటించడానికి టైం పడుతుంది. గ్రీన్ సిగ్నల్ అయితే తీసుకున్నారు.

బడ్జెట్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేయడంతో నిర్మాత ఆర్ధిక వనరులను మరింత బలంగా సెట్ చేసుకునేందుకు టైం తీసుకుంటున్నారని తెలిసింది. లింగుస్వామి బ్రాండ్ ని నమ్మి కథా కథనాలు పట్టించుకోకుండా చేసిన ది వారియర్ దెబ్బకు రామ్ మాస్ మార్కెట్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. తిరిగి ఒక్క బ్లాక్ బస్టర్ పడితే అన్నీ సెట్ అవుతాయి. దసరా తర్వాత రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేశారట. అఖండ ఊహించని స్థాయిలో పెద్ద విజయం అందుకోవడంతో బోయపాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీకి సరైనోడుతో మెగా బ్రేక్ ఇచ్చినట్టు ఇప్పుడు రామ్ కు కూడా అలాంటి మాస్ ఎంటర్ టైనర్ ఇస్తారేమో చూడాలి

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş