iDreamPost
android-app
ios-app

అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె

అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా ఒక్క అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని అమరావతిలోని పలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 17 రోజుల నుంచి నిరసనలు, ఆందోళనలు చేస్తున్న తుళ్లూరు, మందడం తదితర గ్రామాల్లోని ప్రజలు ఈ రోజు నుంచి సకల జనుల సమ్మె చేస్తున్నారు.

ఉదయం మందడం, తుళ్లూరు గ్రామాల్లోని రైతులు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు తెలపాలని కోరారు. అదే విధంగా సచివాలయానికి వెళుతున్న ఉద్యోగులను ఆపి వారి వాహనాలను తుడిచి మద్దతు కోరారు.

కాగా, ఈ రోజు సాయంత్రం బీసీజీ తన నివేదిక ఇవ్వబోతోంది. ఆ తర్వాత హైపవర్‌ కమిటీ తన పనిని ప్రారంభించబోతోంది. జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికను హైపవర్‌ కమిటీ క్షుణ్నంగా పరిశీలించి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి మార్గదర్శనం చేయనుంది.