iDreamPost
android-app
ios-app

కొత్త సినిమాల తాకిడి – కనిపించని సందడి

  • Published Sep 17, 2022 | 6:29 PM Updated Updated Dec 06, 2023 | 5:58 PM

చెప్పుకోవడానికి సినిమాలు ఏడున్నా ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.

చెప్పుకోవడానికి సినిమాలు ఏడున్నా ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.

కొత్త సినిమాల తాకిడి – కనిపించని సందడి

ఎన్నో ఆశలతో ఊసులతో సినిమాలు తీసుకొచ్చిన ఈ శుక్రవారం నిస్సారంగా గడిచిపోయింది. చెప్పుకోవడానికి సినిమాలు ఏడున్నా ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. చెప్పుకోవడానికి సినిమాలు ఏడున్నా ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఆల్రెడీ స్లో అయిపోయిన బ్రహ్మాస్త్ర, కార్తికేయ 2లు మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తున్నాయి. ముందుగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కనీసం ఫ్యామిలీ ఆడియెన్స్ నైనా మెప్పించలేక చతికిలబడితే నేను మీకు బాగా కావాల్సినవాడినంటూ పలకరించిన కిరణ్ అబ్బవరం ఓవర్ మాస్ తో కాలు జారి పడ్డాడు. ఇక శాకినీ డాకినీ పరిస్థితి కూడా సోసోగా అనిపిస్తోంది. ఓటిటి కంటెంట్ ని థియేటర్లో చూసేందుకు జనం ఆసక్తి చూపించడం లేదు.
Clash of new movies - unseen buzz
ఇవి కాకుండా బిగ్ బాస్ సన్నీ సకలగుణాభిరామ, కిచ్చ సుదీప్ డబ్బింగ్ మూవీ కె3 కోటికొక్కడు, అంఅః, నేను నువ్వు కూడా వచ్చాయి కానీ చాలా మటుకు మార్నింగ్ షోలకే నెగటివ్ షేర్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. రిలీజ్ కౌంట్ పరంగా నెంబర్ ఘనంగా ఉన్నా కనీస స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం బయ్యర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఆగస్ట్ లో వరస బ్లాక్ బస్టర్లు చూసి ఇకపై థియేటర్లు జనంతో నిండుతాయనుకుంటే పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. ఇవాళ రావాల్సిన శింబు ది లైఫ్ అఫ్ ముత్తు సెన్సార్ సమస్య వల్ల ఉదయం ఆటలు రద్దు చేసుకుంది. మధ్యాహ్నం 2 తర్వాత షోలు వేశారు. ఇలాంటివి జరగకుండా ముందే జాగ్రత్త పడాల్సింది.

New movies

పబ్లిక్ పల్స్ ని అందుకోవడం చాలా క్లిష్టంగా మారింది. గ్రాండియర్లు అలవాటైన కళ్ళకు సాదాసీదా కంటెంట్ అనడం లేదు. ఎలాగూ ఓటిటిలో చూస్తాం కదా డబ్బులు టైం ఖర్చు పెట్టుకుని ఎందుకు కష్టపడాలనే మనస్తత్వం పెరిగిపోతోంది. దర్శకులు హీరోలు ఇకనైనా జనాన్ని లైట్ తీసుకోవడం ఆపేసి కథా కథనాల మీద దృష్టి పెడితే తప్పకుండా కలెక్షన్లు ఇస్తారు. ఒకే ఒక జీవితం కన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. ఫస్ట్ డే కన్నా తర్వాత రోజుల వసూళ్లు పెరగడం కంటి ముందే కనిపిస్తోంది. అలాంటప్పుడు స్లో టేకింగ్, మితిమీరిన మాస్, కొరియన్ రీమేక్ ఖూనీలను ఎలా ఒప్పుకుంటారు. మరి వచ్చే ఫ్రైడే కూడా పోటీ గట్టిగానే ఉంది. అప్పుడేం జరుగుతుందో చూడాలి