Idream media
Idream media
ఉద్యోగుల డిమాండ్ల పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎంత ఆర్థికభారం పడుతుందనే అంశం పై చర్చించాల్సి ఉందన్న ఆయన ఫిట్ మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీసీఏ చేయవద్దని ఉద్యోగులు అడిగారని హెచ్ ఆర్ఏ శ్లాబుల్లో సవరణలతో ఏడు వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏ లో పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగుల అడిగారు అని వివరించారు.
కనీస హెచ్ఆర్ఏ 12 శాతం ఉండాలని అడిగారన్నారు. ఇక ఉద్యోగుల అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని వివరించారు. ఈరోజు, రేపటి లోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండురోజుల విద్యుత్ కోతలపై టీడీపీ నానా గోల చేస్తుందని టీడీపీ హయాంలో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు అప్పజెప్పి వెళ్లారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాం, రెండు రోజుల్లో ఏ సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేసిన సత్యసాయి జిల్లాపై బాలకృష్ణ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ పేరిట కూడా ఓ జిల్లాను ప్రకటించాం.. టీడీపీ హయాంలో అది కూడా చేసుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారటం సహజం అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటున్న చంద్రబాబు ఏ రోజైనా కేంద్రానికి ఓ లేఖ రాశారా అని నిలదీశారు. మానసిక పరిస్దితి సరిగాలేని సుబ్బారావు గుప్తా విషయంలో స్పందించాలంటే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. సుబ్బారావు గుప్తా వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అన్నీ తెలుసన్న ఆయన తుని ఘటనలో అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఉద్యోగులు అనవసరంగా కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు.
Also Read : ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో ముందడుగు..