iDreamPost
android-app
ios-app

సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

సంక్రాంతికి మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ సర్కార్ యువత, నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టుల భర్తీకి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రామ సచివాలయాల్లో 14,061, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులకు ఒకే సారి వేర్వేరుగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రోజు శనివారం నుంచే ఈ నెల 31 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్‌లో పొందు పరిచిన అర్హతలు, పరీక్ష మార్గదర్శఖాలే ప్రస్తుత నోటిఫికేషన్‌కు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు కొన్ని పోస్టుల్లో 10 శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు మార్చి తర్వాత స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్న సమయంలో ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

గ్రామ సచివాలయం పోస్టులకు gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in వెబ్‌సైట్లలోనూ,

వార్డు సచివాలయ పోస్టులకు  wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in  వెబ్‌సైట్లలోకి దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రామ సచివాలయ పోస్టులు – ఖాళీలు

1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5 : 61
2. వీఆర్వో గ్రేడ్‌–2: 246
3. ఏఎన్‌ఎం గ్రేడ్‌–3 : 648
4. గ్రామ మత్స్యశాఖ అసిస్టెంట్‌ : 69
5. గ్రామ ఉద్యానవనశాఖ అసిస్టెంట్‌ : 1,782
6. గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 : 536
7. గ్రామ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ : 43
8. గ్రామ సంరక్షణ కార్యదర్శి(మహిళా పోలీసు) : 762
9. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ : 570
10. డిజిటల్‌ అసిస్టెంట్‌: 1134
11. విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌–3 1,255
12. పశుసంవర్థక శాఖ సహాయకుడు : 6,858
13. వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ : 97

వార్డు సచివాలయాల్లో పోస్టులు – ఖాళీలు

1. వార్డు పరిపాలనా కార్యదర్శి : 105
2. వార్డు వసతుల కార్యదర్శి : 371
3. వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శి : 513
4. వార్డు విద్యా డాటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి 100
5. వార్డు ప్రణాళిక రెగ్యులేషన్‌ కార్యదర్శి : 844
6. వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి : 213