iDreamPost
android-app
ios-app

కోవిడ్ తో ఆస్పత్రి పాలయిన సచిన్ టెండూల్కర్

  • Published Apr 02, 2021 | 7:35 AM Updated Updated Apr 02, 2021 | 7:35 AM
కోవిడ్ తో ఆస్పత్రి పాలయిన సచిన్ టెండూల్కర్

టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ ఎంపీ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రి పాలయిన సచిన్ పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

ఇటీవల వెటరన్ ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ టోర్నీ పేరుతో పలు మ్యాచులు నిర్వహించారు. రాయ్ పూర్ కేంద్రంగా నిర్వహించిన ఈ టోర్నీలు వివిధ దేశాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. అందులో ఇండియా. శ్రీలంక జట్టు ఫైనల్ కి చేరగా, సచిన్ సారధ్యంలోని జట్టు కప్ గెలుచుకుంది. అయితే ఈటోర్నీలో పాల్గొన్న పలువురు ఇండియన్ ప్లేయర్స్ కరోనా బారిన పడడం కలకలం రేపింది. తొలుత యూసఫ్ పఠాన్, ఆ తర్వాత సచిన్, బద్రీనాథ్, తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కూడా కరోనా బాధితులయ్యారు. వారందరికీ పాజిటివ్ గానిర్ధారణ అయినప్పటికీ హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఆరు రోజుల హోం ఐసోలేషన్ తర్వాత సచిన్ కి శ్వాస సమస్యలు ఏర్పడినట్టు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా డాక్టర్ల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సన్నిహితుల సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకవడంగా ఉండడంతో డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్ఛార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.