రేవంత్‌ సర్కార్‌ శుభవార్త.. రైతులకు ఉచితంగా రూ.5 లక్షలు.. ఇలా అప్లై చేసుకొండి

Telangana Rythu Bheema-New Applicants For 2024: రైతులకు రేవంత్‌ సర్కార్‌ భారీ శుభవార్త చెప్పింది. వారు ఉచితంగా రూ.5లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

Telangana Rythu Bheema-New Applicants For 2024: రైతులకు రేవంత్‌ సర్కార్‌ భారీ శుభవార్త చెప్పింది. వారు ఉచితంగా రూ.5లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. అంతేకాక ఎన్నికల్లో రైతుల కోసం ప్రకటించిన హామీలన్నింటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటింది. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయగా.. త్వరలోనే పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు కూడా అందిస్తామని తెలిపింది. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. అన్నదాతల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తాజాగా రైతు కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇంతకు ఆ పథకం ఏంటి.. దానికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ది, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2024లో అధిక శాతం నిధులను వ్యవసాయ రంగానికే కేటాయించారు. ఏకంగా రూ.72,659 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలను కేటాయించి ఆ రంగానికి తామిచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే రూ.2 లక్షల వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. రైతు భరోసా, పంటల బీమా, నాణ్యమైన విత్తనాలు సరఫరా, వరిపంటకు బోనస్, రైతుకూలీలకు ఆర్థిక సాయం.. ఇలా వ్యవసాయానికి సంబంధించిన పథకాల కోసమే బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించారు.

ఈ క్రమంలో అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే రైతు బీమా పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమాను ప్రభుత్వం అందిస్తోంది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములు కొనుగోలు చేసినవారు, వారసత్వంగా భూములు పొందినవారు అంటే కొత్తగా పాస్ బుక్ లు పొందినవారికి రైతు బీమా లేదు. అలాంటి వారు ఇప్పుడీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దానిలో భాగంగా జూలై 28, 2024 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందేవారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్ట్ 5, 2024 దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఎలా అప్లై చేయాలంటే..

  • అర్హత కలిగిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
  • వారి నుండి రైతు బీమా దరఖాస్తు ఫారం తీసుకుని దాన్ని నింపాలి.
  • ఆ తర్వాత దానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జతచేయాలి.
  • నామినీ ఆధార్ కార్డును కూడా వీటికి జత చేసి అధికారులకు అందజేయాలి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) సహకారంతో ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తారు. దరఖాస్తు సమయంలో పేర్కొన్న నామినీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. 18 ఏళ్ల యువ రైతులను నుండి 59 ఏళ్లలోపు అన్నదాతలు ఈ పథకానికి అర్హులుగా నిర్దారించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది.

Show comments