iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ సమ్మె – ఆగిన మరో రెండు గుండె

ఆర్టీసీ సమ్మె – ఆగిన మరో రెండు గుండె

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె సంస్థ కార్మికుల్లో ఆందోళన నింపుతోంది. బుధవారం మరో గుండె ఆగింది. హైదరాబాద్ నగరం ముషిరాబాద్‌ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(37) గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన రమేష్‌ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు.  రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరింది. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నేతలు ప్రజాప్రతినిధులను కోరనున్నారు.


సమ్మె నేపథ్యంలో.. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో కార్మికుడు గుండె నొప్పితో మరణించాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో  మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గఫూర్‌ తన నివాసంలో టీవిలో ఆర్టీసీ సమ్మె వార్తలు చూస్తుండగానే గుండెనొప్పికి గురయ్యా రు.నొప్పిరాగానే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చేగుంట తుఫ్రాన్‌ మధ్యలో గఫూర్‌ ప్రాణాలు విడిచాడు. ఇతనికి భార్య, ఆరు నెలల కుమార్తె తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు.