iDreamPost
android-app
ios-app

నయన్ పెళ్లికి రూట్ క్లియర్ ?

  • Published Jun 07, 2020 | 7:33 AM Updated Updated Jun 07, 2020 | 7:33 AM
నయన్ పెళ్లికి రూట్ క్లియర్ ?

సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఇప్పటికీ డిమాండ్ ఉన్న నయనతార ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా తన మార్కెట్ లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు. స్టార్ హీరోలతో మొదలుకుని ఫిమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వరకు అందరూ తననే ఛాయస్ గా పెట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాడమైన ప్రేమలో ఉన్న నయనతార త్వరలో మూడు ముళ్ళు వేయించుకోబోతోందని సమాచారం. లాక్ డౌన్ పూర్తిగా సడలించాక హడావిడి లేకుండా ఒక గుళ్ళో కేవలం అతి కొద్దిమంది అతిధుల సమక్షంలో వివాహం చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్టు చెన్నై నుంచి హాట్ అప్ డేట్.

తమ బంధం గురించి ఎన్ని వార్తలు వచ్చినా నయన్ విగ్నేష్ లు ఎప్పుడు ఖండించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు పబ్లిక్ ఈవెంట్స్ లో బాండింగ్ ఎంత గట్టిదో ఋజువు చేసే ప్రయత్నాలే ఎక్కువ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలు పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించినప్పుడు బాగా మీడియాలో నలిగిన నయన్ వాటి నుంచి త్వరగా బయటపడి కెరీర్ ని బలపరుచుకునే దాని మీద ఫోకస్ పెట్టింది. కొద్దిరోజుల క్రితం విగ్నేష్ మదర్స్ డే సందర్భంగా నయన్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనే అయ్యింది. అప్పుడు కూడా నయన్ సైలెంట్ గానే ఉంది. మొత్తానికి ఈ ఇద్దరూ అఫీషియల్ గా ఒక్కటి కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

దర్బార్ తర్వాత నయనతార నటించిన కొత్త సినిమా ఏదీ విడుదల కాలేదు. ప్రస్తుతం నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. రజినీకాంత్ తో చేస్తున్న అన్నాతే, దేవతగా నటిస్తున్న మూకుత్తి అమ్మాన్, విగ్నేష్ శివన్ స్వీయ దర్శకత్వంలో రూపొందబోయే కాతువాకులా రెండు కాదల్ లతో పాటు నేత్రికన్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. సైరా తర్వాత తెలుగులో సినిమాలు చేసేందుకు నయనతార అంత ఆసక్తి చూపడం లేదు. ఒకటి రెండు పెద్ద హీరోల సరసన ఆఫర్లు వచ్చినా ఒప్పుకోవడం లేదు. మరి వివాహం అయ్యాక సమంతా తరహాలో మూవీస్ కంటిన్యూ చేస్తుందా లేక ఫ్యామిలీ లైఫ్ కి అంకితం అవుతుందో వేచి చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet