iDreamPost
android-app
ios-app

తమిళనాడు గవర్నర్ గా మాజీ ఐపీఎస్.. స్టాలిన్ దూకుడుకు కళ్లెం వేసేందుకేనా.. ?

తమిళనాడు గవర్నర్ గా మాజీ ఐపీఎస్.. స్టాలిన్ దూకుడుకు కళ్లెం వేసేందుకేనా.. ?

తమిళనాడు గవర్నర్ గా రవీంద్ర నారాయణ రవి (RN రవి ) బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన నియామకాన్ని డీఎంకే సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్, VCK ప్రశ్నిస్తున్నాయి. నాగాలాండ్ గవర్నర్ గా ఉన్నప్పుడు అక్కడి పాలకపక్షంతో ఆయనకు మధ్య ఉన్న విభేదాలను ఎత్తిచూపుతున్నారు. పాలకపక్షంతో సమానంగా గవర్నర్ సమాంతర ప్రభుత్వం నడిపారన్న ఆరోపణలు గుర్తు చేస్తున్నారు. బీజేపీ యేతర ప్రభుత్వమున్న తమిళనాడుకు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ ఎన్ రవిని నియమించడంలో నిగూఢత ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీకి అప్పటి సీఎం నారాయణస్వామికి మధ్య విభేదాలు గురించి తెలిసిందే. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పనిచేసిన నరసింహన్, రాష్ట్ర విభజన సమయంలో కీ రోల్ ప్లే చేసిన విషయం అందరికీ తెలిసిందే. కిరణ్ బేడీ, నరసింహన్ కూడా ఐపీఎస్ లు గా రిటైర్ అయ్యి గవర్నర్ గా పనిచేసినవారే.

నాలుగు నెలల కిందట ఏర్పడిన తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ కొన్న విధానాలను అసెంబ్లీ సాక్షిగా విభేదించింది. ముఖ్యంగా CAA, NEET లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. దీంతో స్టాలిన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు ఆర్ ఎన్ రవిని అపాయింట్ చేశారా.. ? లేదా సాధారణ బదిలీల్లో భాగంగా జరిగిందా అని కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందా అని DMK సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల నేతలు అనుమానపడుతున్నారు.

Also Read : యూట్యూబ్ ద్వారా ఆ కేంద్రమంత్రికి నెలకు రూ. 4 లక్షలు వస్తున్నాయట..!

రవీంద్ర నారాయణ్ రవి (RN రవి ) స్వస్థలం, బిహార్ రాజధాని పాట్నా. 1976 బ్యాచ్ కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్. ఐపీఎస్ కు సెలక్ట్ కావడానికి ముందు జర్నలిస్ట్ గా పని చేశారు. సీబీఐ, ఐబీ సంస్థల్లోనూ ఆయన పనిచేశారు. నేషనల్ సెక్యూరిటీ డిప్యూటీ అడ్వైజర్ గానూ ఆయన సేవలు అందించారు.

నాగ శాంతి ఒప్పందంలో భాగంగా కేంద్రానికి NSCN-IM కు మధ్య సంధానకర్తగా పనిచేశారు. తర్వాత 2019 ఆగస్టు నుంచి నాగాలాండ్ గవర్నర్ గా పనిచేశారు. NSCN-IMకు గవర్నర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. పాలకపక్షానికి వ్యతిరేకంగా ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపి పాలనపరమైన విధానాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.

రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన గవర్నర్ ఫేర్ వెల్ పార్టీని కూడా కొహిమా ప్రెస్ క్లబ్ (kPC) బహిష్కరించింది. ఆయన నాగాలాండ్ గవర్నర్ గా, నాగా శాంతి ఒప్పంద సంధానకర్తగా ఉన్నప్పుడు జర్నలిస్టులతో మాట్లాడేందుకు నిరాకరించేవారని పేర్కొన్న Kpc ఆయన ఫేర్ వెల్ పార్టీ వార్తను కూడా పబ్లిష్ చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

Also Read : స్నేహం కోసం.. సేన-బీజేపీ పొత్తు పై ఊహాగానాలు.. బలం చేకూర్చిన సీఎం వ్యాఖ్యలు