iDreamPost
iDreamPost
“జగన్ బెయిలు రద్దవుతుంది. జగన్ జైలుకు వెళ్తారు. ఆయన జైలుకు వెళ్ళగానే అధికార పార్టీలో రచ్చ మొదలవుతుంది. జగన్ శ్రీమతి భారతిని ముఖ్యమంత్రిని చేయాలని జగన్ కుటుంబ సభ్యులతోసహా కొందరు ఎమ్మెల్యేలు కోరతారు. ఇంకొందరు వ్యతిరేకిస్తారు. పార్టీలో చీలిక వస్తుంది. ఒకానొక దశలో మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మంత్రి ధర్మాన కృష్ణ దాస్, ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు పార్టీని చీల్చేస్తారు. వీరిలో ఎవరో ఒకరు తాత్కాలికంగా ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు ఇస్తారు. చివరికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.” –ఇంచుమించుగా ఇదే ఆంధ్ర జ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ గత 13 నెలలుగా కంటున్న పగటి కలలు.
వారం వారం కొత్తపలుకు పేరుతో ఆయన రాస్తున్న వ్యాసంలో ఏర్చి, పేర్చి కూర్చే అక్షరాలు ఇలాగే ఉంటున్నాయి. ఇంకొక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసేందుకు రాధాకృష్ణ ఇష్టపడడం లేదు. కేసుల విచారణ మొదలవుతుందని, బెయిలు రద్దవుతుందని, జగన్ జైలుకు వెళ్ళడం తప్పదని, పార్టీ చీలిపోతుందని అంటూనే ఈ పరిణామాలు టీడీపీకి అనుకూలంగా మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అని రాధాకృష్ణ గడచిన 14 నెలలుగా కలలు కంటూనే ఉన్నారు.
Also Read:బీజేపీ దూకుడుకు టీడీపీ బ్రేకులేయగలదా..?
తన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు పదవి కోల్పోవడాన్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అజీర్తికి రెండు కారణాలు. మొదటిది తన మీడియా సంస్థకు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన ఆదాయం ఇప్పుడు లేకపోవడం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు రాధాకృష్ణ యాజమాన్యంలోని ఆంధ్రజ్యోతి టీవీ ద్వారానే ప్రసారం అయ్యేవి. కోట్ల రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆంధ్ర జ్యోతి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేవి. ఇతర టీవీలు అన్ని ఆంధ్ర జ్యోతి ఇచ్చే సిగ్నల్ తీసుకుని ప్రసారం చేసేవి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్ర జ్యోతి యాజమాన్యానికి నెలకు రూ 50 లక్షలు చెల్లించేవారు.
ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం కాకుండా శాసనసభ సమావేశాలు కూడా ఆంధ్ర జ్యోతి ప్రత్యక్ష ప్రసారం చేసేది. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం శాసనసభ సమావేశాలు జరిగిన ప్రతిసారి వారానికి ఓ 50 లక్షలు చెల్లించుకోవాల్సిందే. ఇవి కాకుండా అప్పుడప్పుడూ ముఖ్యమంత్రితోనో, మంత్రులతోనో ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రసారం చేసి ఒక్కో ప్రసారానికి సగటున 5 లక్షలు పుచ్చుకుంటారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ సదుపాయాన్ని అడ్డం పెట్టుకుని అందుకున్న తాయిలాలు. “బాబు ఆగ్రహం” అంటూ ఓ కథనం పత్రికలో ప్రచురితం అవుతుంది. టివిలో ప్రసారం అవుతుంది. “ఏం, ఆ పత్రిక యజమాని కంటే నేనేమన్నా తక్కువా? ఆయనకిచ్చినట్టు నాకెందుకివ్వరు?” అంటూ బెదిరించే అవకాశం కూడా ఉంటుంది.
Also Read:జగన్ నిర్ణయాలు, పథకాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర పెద్దలు
ఇప్పుడు ఈ చందాలు, దందాలు అన్నీ పోయాయి. మొత్తంగా ఎంత రాబడి పోయింది? మరి రాధాకృష్ణకు బాధ ఉండదా? అర్జంటుగా జగన్ ప్రభుత్వం రద్దు కావాలని రాధాకృష్ణ కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే రెండుమూడు వారాలకోసారి కొత్త పలుకులో జగన్ బెయిలు రద్దవుతుందని, జగన్ జైలుకు వెళ్తాడని, భారతి ముఖ్యమంత్రి అవుతుందని రాధాకృష్ణ రాస్తూ ఉంటాడు.
ఇక ఈ రాతలకు రెండో కారణం కులం. రాధాకృష్ణకు ఎందుకో కులఅభిమానమూ ఎక్కువే. అప్పుడెప్పుడో నటుడు మోహన్ బాబు “నీకు కులపిచ్చి ఎక్కువ” అని మొహం మీదే తిట్టేశారు. అయినా రాధాకృష్ణ ఆ పిచ్చి వదలడు. తనచంద్రబాబు అధికారంలో లేకపోవడాన్ని రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు.
వివిధ పథకాల మీద ఇంటర్వ్యూకు ముందు చంద్రబాబుకు రాధాకృష్ణ సూచనలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది. ఒక మాజీ ముఖ్యమంత్రి పేరుతొ ఉన్న పథకాన్ని … ఇంకా వాడి తీయివేయలేదా? అనటం అందరు విన్నారు.”రాజా గురువు” అన్న టైటిల్ కోసం రాధాకృష్ణ పడిన ఆత్రం అందరు చూశారు .అప్పట్లో రాజా గురువు అంటూ రామోజీ రావ్ మీద జరిగిన చర్చ ఇప్పుడు తన మీద జరగాలని కోరుకుంటున్నాడు. రాజా గురువు ఏమో కానీ కుల గురువు కూడా కాలేడన్న సత్యం ఎప్పటికీ బోధపడుతుందో!
Also Read:కాంగ్రెస్ ‘మార్క్’ రాజకీయం: అస్మదీయులకు అందలం- తస్మదీయులకు మంగళం
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్తులో ఇక్కడ బలపడే అవకాశాలు లేవు. పరిస్థితుల్లో అధికారంలో రాగల అవకాశం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంది. అమరావతి పేరుతో ఓ పెద్ద కూకట్ పల్లి నిర్మించుకుని విజయవాడ-గుంటూరు మధ్య ఆర్ధిక కేంద్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఎవరు అధికారంలో ఉన్నా రాజధానిలో మాత్రం తామే పెత్తనం చేసే అవకాశానికి జగన్మోహన్ రెడ్డి గండికొట్టటం రాధాకృష్ణకు మింగుడు పడడం లేదు.అందుకే వారం వారం ఇలా అసంబద్ధ వార్తలు రాస్తూ ఉంటాడు.
రాధాకృష్ణ రాతలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అనే స్పృహ కూడా లేకుండాపోయింది.చంద్రబాబుకైనా నిద్రపడుతుందేమో కానీ రాధాకృష్ణ కు మాత్రం కంటి మీద కునుకు వస్తున్నట్లు లేదు.. దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ జగన్ ను అరెస్ట్ అయ్యేలా చూడు అని నిత్యం జపం చేస్తున్నాడు..