తేజ్ బ్రదర్స్ ప్రయత్నాలు మంచివే కానీ

కేవలం వారం గ్యాప్ లో బాక్సాఫీస్ ని పలకరించిన అన్నదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ అనూహ్యంగా ఒకే రకమైన ఫలితాన్ని దక్కించుకోవడం అభిమానులకు షాక్ గా ఉంది. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ ఎంత విస్తృతమైన ప్రమోషన్లు చేసినా సరే థియేట్రికల్ బిజినెస్ మార్క్ ని అందుకోలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగగా అతి కష్టం మీద ఆరు కోట్ల మార్కుని దాటేసింది కానీ దసరా పండగ నేపథ్యంలో కొత్త సినిమాల తాకిడిలో నిలబడటం కష్టమే. అందులోనూ ఇంకా అయిదు కోట్ల షేర్ రాబట్టడం సులభం కాదు. వచ్చిన టాక్ కి అది జరగడం సాధ్యం కాదని సామాన్య ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు.

ఇక కొండపొలం పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. మొదటి వీకెండ్ 3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. ఉప్పెన క్రేజ్ ని క్యాష్ చేసుకోకుండా నిర్మాతలు చాలా రీజనబుల్ డీల్స్ చేసుకున్నారు. 8 కోట్ల దాకా బిజినెస్ చేసుకున్న ఈ సినిమా సైతం బ్రేక్ ఈవెన్ కి దూరంలో ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మహా సముద్రం, పెళ్లి సందడి లాంటి క్రేజీ మూవీస్ ని తట్టుకుని ఇంకా రాబట్టుకోవడం దాదాపు జరగని పని. టాక్ డీసెంట్ గా ఉన్నా కొండపొలం ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ల దాకా రప్పించలేకపోతోంది. మాస్ ప్రేక్షకులు కూడా ఎక్కువగా టర్న్ అవ్వడం లేదు. సో వ్యత్యాసం మరీ భారీగా ఉండదు కాబట్టి డిజాస్టర్ ముద్ర తప్పినట్టే.

మొత్తానికి తేజ్ బ్రదర్స్ ఇద్దరూ ఒకే రిజల్ట్ అందుకోవడం విచిత్రం. అందులోనూ రెండు రెగ్యులర్ మసాలా కమర్షియల్ సినిమాలు కావు. నిజాయితీగా చేసిన ప్రయత్నాలు. అయితే టేకింగ్ అండ్ రైటింగ్ లో జరిగిన కొన్ని పొరపాట్లు ఓవరాల్ గా ఇలా ప్రభావం చూపించాయి. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న సాయి తేజ్ ఇంకా బయటికి రాలేదు. తన సినిమా గురించి వీడియో బైట్ ఏదైనా ఇస్తాడేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి కేవలం బొటన వేలి ఫోటోతో సరిపెట్టారు. ఇక వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ గిరిసాయ దర్శకత్వంలో కమర్షియల్ ఫ్లేవర్ లో సాగుతుందట. ఇటీవలే దీని షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పేరు

Show comments