వేడుకలు విజయవాడలోనే!

విశాఖలో వేడుకలు జరుగుతాయని తొలుత ప్రచారం జరిగినా ఆంధ్రప్రదేశ్ గణతంత్ర వేడుకల వేదిక మారింది. తొలుత విశాఖపట్నంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ సర్కారు, నేడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. విజయవాడలోనే ఈ వేడుకలు జరుగుతాయని, అందుకు ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి.

Read Also: చేతులు కట్టుకోవద్దు,చెప్పులు విడవద్దు,కళ్ళు మొక్కొద్దు..ఇది మీ ఆఫీస్… కలెక్టర్

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు అందడంతో, అధికారులు హుటాహుటిన స్టేడియంకు చేరుకున్నారు. కాగా, విశాఖలో ఇప్పటికే రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక పాఠశాలల విద్యార్థుల రిహార్సల్స్ కూడా జరిగిన తరువాత వేదికను మార్చడం గమనార్హం.

విశాఖలోని పోర్ట్ స్టేడియం లో ఈ వేడుకలు జరపాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ వినయ్ చంద్, ఇతర అధికారులు ఆ వేదికను ఏర్పాట్లను పరిశీలించారు. అయితే తాజాగా ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు.

Show comments