Jio: అంబానీ బంపరాఫర్‌.. రూ.3 వేలకే 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..!

జియో మరో సంచలనానికి తెర తీసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

జియో మరో సంచలనానికి తెర తీసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

టెలికాం రంగంలో జియో ఒక సంచలనం అని చెప్పవచ్చు. అంబానీ దెబ్బకు ఈ రంగంలో దిగ్గజ సంస్థలు దిగి రాక తప్పలేదు. జియో రాకముందు వరకు అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌ అనేవి సామాన్యులకు పెను భారంగా ఉండేవి. దీన్నే జియో అవకాశంగా వాడుకుంది. అతి తక్కువ ధరకే.. అన్‌లిమిటెడ్‌ టాక్‌ టైం, డేటాను అందిస్తూ.. అప్పటికే ఈ రంగంలో దిగ్గజ సంస్థలుగా ఉన్న ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ కంపెనీలను భారీ షాక్‌ ఇచ్చింది. దాంతో అవి కూడా దిగి రాక తప్పలేదు. ఇక ఇప్పుడు దేశంలో జియోకు కస్టమర్ల సంఖ్యా భారీగా ఉంది. పైగా కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌ తీసుకు వస్తూ.. మిగతా కంపెనీలకు భారీ షాక్‌ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా అంబానీ మరో బంపరాఫర్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. కేవలం 3 వేల రూపాయలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ని అందుబాటులోకి తీసుకురానున్నాడని సమాచారం. అది కూడా అదిరిపోయే ఫీచర్లతో అంట. ఆ వివరాలు..

కస్టమర్లకు జియో గుడ్‌ న్యూస్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు వేల రూపాయలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. తన 5జీ సిమ్ సేవతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి జియో సన్నాహాలు చేస్తోందని ఇంగ్లీష్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ జియో మాత్రం కేవలం 3 వేల రూపాయలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానుందని.. దీనిలో అద్భుతమైన ఫీచర్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు లీకైన సమాచారం ప్రకారం ఈ రాబోయే జియో స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ రామ్‌ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండే అవకాశం ఉంది. కెమరా విషయానికి వస్తే.. 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అలానే సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ రాబోయే ఫోన్‌లో ఉన్న మరోక ఫీచర్‌.. ఇది 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానుందట. ఇక ఈ ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్‌ చేయవచ్చని పేర్కొంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మొత్తం 2 రోజుల పాటు ఫోన్‌ను ఉపయోగించవచ్చు అని తెలుస్తోంది.

రానున​ ఈ జియో 5జీ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది అని సమాచారం. దీనిలో మీరు 4కే వీడియోలను ప్లే చేయవచ్చు. ఫోన్ ధర గురించి మాట్లాడితే కంపెనీలు ఈ 5G ఫోన్‌ను చాలా తక్కువ ధరకే తీసుకురానుంది. ఈ సరికొత్త డివైజ్ ధర రూ.3000 ఉండనుంది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయలేని వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ కానుంది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. తక్కువ ధరలో బెస్ట్‌ ఫీచర్స్‌ ఉండే ఫోన్‌ కొనాలని భావించే వారు.. జియో ఫోన్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే జియో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయనుంది.

Show comments