iDreamPost
android-app
ios-app

వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లనన్న రేణు.. కారణం ఏంటంటే..

  • Published Oct 30, 2023 | 10:39 AM Updated Updated Oct 30, 2023 | 10:39 AM

నిశ్చితార్థ వేడుకకు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హజరయ్యారు. పెళ్లికి కూడా అత్యంత సన్నిహితులు, బంధువు మిత్రలను మాత్రమే పిలిచే అవకాశం ఉంది.

నిశ్చితార్థ వేడుకకు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హజరయ్యారు. పెళ్లికి కూడా అత్యంత సన్నిహితులు, బంధువు మిత్రలను మాత్రమే పిలిచే అవకాశం ఉంది.

  • Published Oct 30, 2023 | 10:39 AMUpdated Oct 30, 2023 | 10:39 AM
వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లనన్న రేణు.. కారణం ఏంటంటే..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిలు అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థ వేడుక అయిపోయింది. నిశ్చితార్థ వేడుకకు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హజరయ్యారు. పెళ్లికి కూడా అత్యంత సన్నిహితులు, బంధువు మిత్రలను మాత్రమే పిలిచే అవకాశం ఉంది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా వీరి పెళ్లి జరగనుంది. ఇక, వరుణ్‌ తేజ్‌ పెళ్లి వెళ్లే విషయంపై రేణు దేశాయ్‌ తాజాగా స్పందించారు.

‘మీరు వరణ్‌ తేజ్‌ పెళ్లికి వెళతారా?’ అన్న జర్నలిస్ట్‌ ప్రశ్నకు ఆమె ‘వెళ్లను’ అని సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను నీహా పెళ్లికి కూడా వెళ్లలేదు కదా.. పిల్లల్ని పంపించేశాను. సో.. నేను వెళ్లను. వరణ్‌కు ఎనిమిదేళ్లు ఉన్నప్పటినుంచి నా ముందే పెరిగాడు. ఓ పది సంవత్సరాల వరకు.. అతడికి ఎప్పటికీ నా ఆశీస్సులు ఉంటాయి. నా ప్రేమ ఉంటుంది. నా వైపు నుంచి వరణ్‌కు ఎప్పుడైనా నా బెస్ట్‌ విస్సెస్‌ ఉంటాయి. ఐ విష్‌ హిమ్‌ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌.

కానీ, నేను మాత్రం వెళ్లను. ఎందుకంటే.. అది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అది అంతే.. ’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రేణు దేశాయ్‌ చాలా ఏళ్ల తర్వాత తన నటనా ప్రస్ధానానికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ‘ టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ మంచి పాత్రలో నటించారు. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. మరి, రేణు దేశాయ్‌.. వరుణ్‌ తేజ్‌ పెళ్లికి వెళ్లననటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet